మల్టీప్లెక్స్‌... ఏదైనా సినిమాకి వెళ్తే చాలు దోచేస్తారు... ఇది ఒక మాఫియా... ప్రజలను దోచేస్తారు... నియంత్రణ లేక, అడిగేవారు లేక చలరేగిపొతూ ఉంటారు... కనీసం మంచి నీళ్ళు కూడా లోపలకి తీసుకు వెళ్ళనివ్వరు... లోపల కొందాం అంటే MRP మీద, నాలుగు అయిదు రెట్లు ఎక్కువ అమ్ముతారు.. ఏదైనా తిందాం అంటే, కనీసం 250 రూపాయలు పెట్టాలి... అయితే ఇప్పుడు ఈ దోపిడీకి చెక్ పెట్టనుంది ప్రభుత్వం... పౌర సరఫరాలశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఆకస్మిక తనిఖీల్లో, ఈ విచ్చల విడి దోపిడీ గుర్తించారు...పరిస్థితిని నియంత్రణలోకి తేవాలని, మాల్స్‌లో జరుగుతున్న దోపిడీ అరికట్టాలని కలెక్టర్‌ను ఆదేశించారు...

multiplex 23102017 2

దీంతో కృష్ణా జల్లా కలెక్టర్ బి.లక్ష్మీకాంతం వెంటనే ఆదేశాలు జారీ చేశారు...వెంటనే జాయింట్‌ కలెక్టర్‌ విజయకృష్ణన్‌తో మాట్లాడుతూ నగరంలోని మల్టీప్లెక్స్‌ నిర్వాహకులతో అధిక ధరల నియంత్రణపై సమావేశం ఏర్పాటు చేసి గట్టిగా హెచ్చరికలు చేయమని ఆదేశించారు... నగర ఆర్డీవో హరీష్‌, తహసీల్దార్‌ ఆర్‌.శివరావులతో కూడిన బృందాలు మల్టీప్లెక్స్‌ల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించనున్నాయి... ప్రజల నుంచి ఈ దోపిడీ పై ఫిర్యాదులు వస్తే, ఆ మల్టీప్లెక్స్‌ పై భారీ జరిమానాలు విధించనున్నారు. రెండోసారీ ఫిర్యాదు వస్తే ఏకంగా లైసెన్స్‌లనే రద్దు చేస్తారు.

multiplex 23102017 3

అంతే కాదు, బయటి నుంచి వాటర్‌, ఫుడ్‌ వంటివి లోపలికి తప్పనిసరిగా అనుమతించాలి. మార్కెట్‌లో వాటర్‌ బాటిల్స్‌, కూల్‌ డ్రింక్స్‌, ఇతర పానీయాల ధరలు ఎలా ఉంటాయో, ఆదే విధంగా మాల్స్‌లో కూడా ఉండాలి. కాంబో పేరుతో సందర్శకులను బలవంతంగా దోపిడీ చేసే విధానాన్ని కూడా మానుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. ఇవన్నీ ఇవాల్టి నుంచి (సోమవారం నుంచి), అమలులోకి రానున్నాయి... ప్రభుత్వం, అధికారాలు ఎంత వరకు, ఈ దోపీడి అరికట్టగలరో చూద్దాం... ప్రజలు కూడా, ఇక ఫిర్యాదులు చెయ్యాలి... అప్పుడే అధికారులు కూడా చర్యలు తీసుకోగలరు... ఇప్పటికైనా ఈ మల్టీప్లెక్స్‌ దోపిడీకి చెక్ పడుతుంది అని ఆశిద్దాం...

Advertisements