టిడిపి అధిష్టానం వైఖరితో మనస్థాపం చెంది ఆనం కుటుంబం టీడీపీని వీడుతుందని, జగన్‌ పార్టీలోకి వెళ్తున్నామని, ఆయనతో మాట్లాడినట్లు జరుగుతున్న ప్రచారంపై ఆనం వివేకా కుమారుడు, నెల్లూరు 12వ డివిజన్‌ కార్పొరేటర్‌ ఆనం రంగమయూర్‌రెడ్డి ఘాటుగా స్పందించారు. వస్తున్న పుకార్లు వాస్తవం కాదని 12వ డివిజన్‌ కార్పొరేటర్‌ ఆనం రంగమయూర్‌రెడ్డి అన్నారు. సోమవారం తన డివిజన్‌ పరిధిలోని సౌత్‌రాజుపాళెంలో నిర్వహించిన పలు అభివృద్ధి పనులను ఆయన పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జగన్‌తో మేము ఎవరూ టచ్‌లో లేమని స్పష్టం చేశారు. తమ కుటుంబంలో ఒకరికి ఎమ్మెల్యే, మరొకరికి మేయర్‌ పదవులు ఇస్తారంటూ వస్తున్న కథనాల్లోనూ వాస్తవం లేదని తేల్చి చెప్పారు.

aanam 17072018 2

మాకు పార్టీ మారే ఆలోచన లేకపోయినా ఆత్మీయులతో సంప్రదించాక ముందుస్తు నిర్ణయాన్ని వెల్లడించి ఆపై తుది అడుగు వేస్తామన్నారు. కొన్ని రోజుల క్రితం ఆనం జగన్‌తో భేటీ అయ్యారన్నది వాస్తవం కాదన్నారు. అనంతరం ఆయన పనులు పరిశీలించి తనిఖీ చేశారు. మరో పక్క, నెల్లూరు తెలుగుదేశం అధ్యక్షుడుగా ఆనం జయకుమార్‌రెడ్డిని నియమితులు కానున్నట్లు సమాచారం. ఈ మేరకు పార్టీ అధినేత చంద్రబాబు నుంచి గ్రీన్‌ సిగ్నల్‌ వచ్చినట్లు తెలిసింది. టీడీపీ పట్ల అభిమానం, నగర రాజకీయాలపై అనుభవాలు ప్రధాన అర్హతలుగా జయకుమార్‌రెడ్డిని ఈ పదవికి ఎంపిక చేశారు. బీసీ, ఎస్సీ, కమ్మ సామాజిక వర్గాలకు సముచిత ప్రాధాన్యం కల్పిస్తూ కొత్త నగర కమిటీ ఏర్పాటు కు కసరత్తు జరుగుతోంది.

aanam 17072018 3

ఆనం జయకుమార్‌రెడ్డిని నగర పార్టీ అధ్యక్షుడిగా ఎంపిక చేయడం వెనుక ప్రధానంగా రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి ఆయన పార్టీ పట్ల చూపుతున్న విశ్వసనీయత. రెండు నగర రాజకీయాలపై ఆయనకు ఉన్న అను భవం. జయకుమా ర్‌రెడ్డి ఆనం వివేకా, రామనారాయణ రెడ్డిల కన్నా ముందే తెలుగుదేశం పార్టీలో చేరారు. మాజీ మంత్రి ఆదాల ప్రభాకర్‌ రెడ్డి వెంట ఆయన తెలుగు దేశంలోకి అడుగుపెట్టారు. తాజా గా ఆనం రామనారాయణరెడ్డి టీడీపీ వీడిపోతురనే ప్రచారం జరిగినా, జయకుమార్‌రెడ్డి తెలుగుదేశంలోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. ఆదాల ప్రభకర్‌రెడ్డి వెంట రాగా రెండు సార్లు పార్టీ అధినేత చంద్రబాబును కలిసి తన నిర్ణయాన్ని వెల్లడించారు. పార్టీ పట్ల ఆయన చూపుతున్న అభిమానం చంద్రబాబును ఆకర్షించింది. అలాగే నగర రాజకీయాలపై ఆయనకు ఉన్న అనుభవం కూడా అధ్యక్షపదవికి అర్హత సంపాదించి పెట్టింది.

Advertisements