జగన్ మోహన్ రెడ్డి పై కోడి కత్తితో గుచ్చిన సంగతి తెలిసిందే. 0.5 cm లోతులో గుచ్చితే, జగన్ 20 రోజులుగా రెస్ట్ లో ఉన్నారు. ఇది ఇలా ఉంచితే, ఈ కేసు పై పోలీసులు విచారణ చేస్తున్నారు. మరో పక్క, జగన్ కూడా కోర్ట్ లో కేసు వేసారు. నాకు సిబిఐ దర్యాప్తు కావాలని కేసు వేసారు. రాష్ట్ర ప్రభుత్వ అధీనంలో లేని స్వతంత్ర దర్యాప్తు సంస్థతో ఈ దాడిపై విచారణ జరిపించాలని జగన్‌, ఆయన చిన్నాన్న వైవీ సుబ్బారెడ్డి వేర్వేరు పిటిషన్లు వేసిన సంగతి తెలిసిందే. అలాగే విమానాశ్రయాల్లో భద్రతపై సీబీఐ దర్యాప్తు చేయించాలని అనిల్‌కుమార్‌ మరో ప్రజాహిత వ్యాజ్యం దాఖలు చేశారు. ఇవి గురువారం చీఫ్‌ జస్టిస్‌ టీబీఎన్‌ రాధాకృష్ణన్‌, జస్టిస్‌ ఎస్వీ భట్‌లతో కూడిన ధర్మాసనం ముందు విచారణకు వచ్చాయి.

jagan 09112018 2

దీని పై నిన్న విచారణ సందర్భంలో, విమానాశ్రయంలో దాడికి సంబంధించిన దర్యాప్తునకు వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ సహకరించడం లేదని ఆంధ్రప్రదేశ్‌ అడ్వొకేట్‌ జనరల్‌ (ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్‌ హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. రక్తం మరకలున్న చొక్కా ఇంత వరకూ దర్యాప్తు అధికారులకు అందజేయలేదని.. సీఆర్‌పీసీ 160 సెక్షన్‌ కింద వాంగ్మూలం ఇవ్వడానికీ నిరాకరించారని తెలిపారు. పోలీసుల దర్యాప్తు ఎంతవరకు వచ్చిందో తెలుసుకుని వచ్చే మంగళవారం విచారణ చేపడతామని కోర్టు తెలిపింది. ఇప్పటికే ఆలస్యం జరిగినందున వెంటనే విచారణ జరిపించాలని హైకోర్టును జగన్‌ తరఫు న్యాయవాది కోరారు.

jagan 09112018 2

జగన్‌పై దాడిని చిన్నదిగా డీజీపీ మీడియాకు చెప్పారని, వైసీపీ కార్యకర్తే సానుభూతి కోసం దాడి చేశారని సీఎం ప్రకటించారని, ఎటువంటి విచారణ జరగక మునుపే ఇలాంటి ప్రకటనల వల్ల తమకు రాష్ట్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలపై నమ్మకం పోయిందని పిటిషనర్ల తరఫున న్యాయవాదులు సీవీ మోహన్‌రెడ్డి, దేశాయ్‌ ప్రకాశ్‌రెడ్డి తెలిపారు. అయితే బాధితుడే కోర్టును ఆశ్రయించాక ఇక ప్రజాహిత వ్యాజ్యం ఎందుకని సీజే ప్రశ్నించారు. దర్యాప్తు తీరుపై శుక్రవారం నివేదిక అందజేయాలని ఏజీని ఆదేశించారు. అయితే దర్యాప్తు నివేదికను విశాఖ నుంచి తేవలసి ఉందని.. సోమవారం లేదా మంగళవారం కోర్టుకు అందజేయగలమని ఆయన బదులిచ్చారు. వాదనలు విన్న ధర్మాసనం.. తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదావేసింది.

Advertisements