నవంబర్ నెలలో, అమరావతిలో రెండు ఈవెంట్స్ జరగబోతున్నాయి. ఒకటి బోటింగ్ రేస్ అయితే, మరొకటి ఎయిర్ షో. గగన విన్యాసాలకు అమరావతి కేరాఫ్‌గా మారుతోంది. రాజధాని ప్రాంతంలోని అన్ని వర్గాలను అమితంగా ఆకట్టుకున్న ఎయిర్‌ షో వరుసగా రెండో ఏడాది కూడా అమరావతిలో నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. కృష్ణానదిపై దుర్గా ఘాట్‌ వద్ద ఎయిర్‌ షో మోత మోగబోతోంది.. గతేడాది రాజధాని ప్రజలను ఎంతగానో అకట్టుకున్న ఎయిర్‌షో నిర్వహణకు కృష్ణాజిల్లా యంత్రాంగం, పర్యాటక శాఖలు సంయుక్తంగా ఏర్పాట్లు చేస్తున్నాయి. రోజుకు లక్షమంది చొప్పున మూడురోజుల పాటు మూడు లక్షల మందికిపైగా ఎయిర్‌షో వీక్షించేందుకు వస్తారని అధికార యంత్రాంగం అంచనా.

airshow 04112018 2

ఎయిర్‌షోలో ప్రత్యేక ఆకర్షణగా ఏరోబాటిక్‌ ఫ్లయింగ్‌ డిస్‌ప్లే’ ఉంటుంది. యునైటెడ్‌ కింగ్‌డమ్‌కు చెందిన గ్లోబల్‌ స్టార్‌ టీమ్‌ బ్రిటీష్‌ ఏరోబాటిక్స్‌ చాంపియన్స్‌ ఎయిర్‌షోలో పాల్గొననున్నారు. సోలో, మల్టీ ఫ్లైట్స్‌ డి స్‌ప్లే, సోలో ఎయిర్‌ డిస్‌ప్లే ప్రత్యేకాకర్షణకానున్నాయి. లూప్స్‌, బ్యారెల్‌ రోల్స్‌, క్యూబన్స్‌, టర్న్స్‌ ప్రదర్శనలు ఉంటాయి. విన్యాసాలకు మొత్తం నాలుగు ప్రత్యేక ఎయిర్‌ క్రాప్ట్స్‌ విజయవాడ విమానాశ్రయానికి రానున్నాయి. గ్లోబల్‌ స్టార్‌ టీమ్‌ విన్యాసాలను నిర్వహిస్తుంది. కిందటి ఎయిర్‌షోను దృష్టిలో ఉంచుకుని పర్యాటకశాఖ అధికారులు నేవీ బృందంతో కూడా చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. నేవీ అంగీకరిస్తే అతిపెద్ద ఎగ్జిబిషన్‌కూడా నిర్వహించే అవకాశాలున్నాయి.

airshow 041120183

ఎగ్జిబిషన్‌తో పాటు కైట్‌ ఫెస్టివల్‌ నిర్వహణకు ఏర్పాట్లు చేశారు. తొలిరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు ఎయిర్‌షోను ప్రారంభిస్తారు. ఎయిర్‌షో సన్నాహక ఏర్పాట్లకు సంబంధించి కృష్ణాజిల్లా కలెక్టర్‌ లక్ష్మీకాంతం కార్పొరేషన్‌, ఇరిగేషన్‌, మత్స్యశాఖ, అగ్నిమాపక శాఖ, రెవెన్యూ, ఆర్‌అండ్‌బీ, వైద్య తదితరశాఖలకు బాధ్యతలను అప్పగించారు. ఆయా తేదీల్లో ఉదయం 10.15 - 10.45 గంటల మధ్య, సాయంత్రం 4.15 - 4.45 గంటల మధ్య విన్యాసాలు ఉంటాయి. నవంబరు 16 నుంచి 18 వరకూ నిర్వహించే బోటు రేసింగ్‌ను కూడా ముఖ్యమంత్రి ప్రారంభిస్తారు. 400 మంది బోటు రేసింగ్‌ రైడర్లు పాల్గొంటారు.

Advertisements