‘తిత్లీ’ తుపాను ఉత్తరాంధ్రను అతలాకుతలం చేసింది. అక్కడి ప్రజలను ఆదుకోవడానికి ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు ముందుకొచ్చారు. ఇప్పుడు హీరో అల్లు అర్జున్ కూడా తనవంతు సహాయం చేస్తానని శనివారం తెలిపారు. రూ.25 లక్షలు విరాళంగా ప్రకటించారు. ఈ మేరకు ఆయన ట్విటర్‌లో స్పందిస్తూ.. ‘శ్రీకాకుళం ప్రజల పరిస్థితి విన్న తర్వాత చాలా బాధేసింది. తుపాను ప్రభావం వల్ల జరిగిన నష్టం చూశాక నా హృదయం ద్రవించిపోయింది. ‘తిత్లీ’ తుపాను బాధితులకు రూ.25 లక్షలు విరాళంగా ప్రకటిస్తున్నా‌. ఈ కష్ట సమయంలో మన వారికి మనవంతు సహాయం చేయడానికి ముందుకొద్దాం’ అని పోస్ట్‌ చేశారు.

allu 20102018 2

సినీ ప్రముఖులు బాలకృష్ణ రూ.25 లక్షలు, ఎన్టీఆర్‌‌ రూ.15 లక్షలు, కల్యాణ్‌రామ్‌ రూ.5 లక్షలు, విజయ్‌ దేవరకొండ రూ.5 లక్షలు, కొరటాల శివ రూ.3 లక్షలు, కార్తికేయ రూ.2 లక్షలు, అనిల్‌ రావిపూడి రూ.లక్ష, సంపూర్ణేష్‌ బాబు రూ.50 వేలు బాధితుల సహాయార్థం ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళంగా ప్రకటించారు. కథానాయకుడు నిఖిల్‌ స్వయంగా శ్రీకాకుళం చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. తితలీ తుఫాను బాధితులకు రూ. 25 లక్షల సాయం ప్రకటించి, పెద్ద మనసు చాటుకున్న అల్లు అర్జున్‌ను మంత్రి నారా లోకేశ్ ట్విట్టర్‌లో అభినందించారు.

Advertisements