ఈ నెల 23వ తేదీ నుండి 25వ తేదీ వరకు విజయవాడ నగరంలో కృష్ణా నదీ తీరాన అద్భుత విమాన విన్యాసాలు జరుగబోతున్నాయి. రాష్ట్ర పర్యాటకశాఖ, ఫిక్కీల సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 23వ తేదీ నుండి 25వ తేదీ వరకు మూడు రోజుల పాటు నిర్వహించే ఎయిరోబాటిక్ ఎయిర్‌షో నిర్వహణ, చేపట్టిన ఏర్పాట్లుపై మంగళవారం కృష్ణా జిల్లా కలెక్టర్ బీ లక్ష్మీకాంతం నగరంలోని తన క్యాంపు కార్యాలయంలో మీడియా ప్రతినిధుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విమాన విన్యాసాలకు ప్రవేశం ఉచితమని ప్రతి ఒక్కరూ ఈ విన్యాసాలకు తిలకించాలని ఆయన కోరారు.

amaravati 22112018

విన్యాసాల్లో బ్రిటీష్ ఎయిర్ వేస్‌కు చెందిన నాలుగు విమానాలు, ఐదుగురు పైలెట్‌లతో విన్యాసాలు నిర్వహించనున్నాయన్నారు. 23 నుండి 25వ తేదీ వరకు ప్రతిరోజు ఉదయం 11 గంటలకు ప్రారంభమై 15 నిమిషాలు, సాయంత్రం 4 గంటలకు ప్రారంభమై 15 నిమిషాలు పాటు విన్యాసాలు ఉంటాయన్నారు. 23వ తేదీ ఎయిర్‌షో ప్రారంభ కార్యక్రమానికి మంత్రి భూమా అఖిల ప్రియ హాజరుకానున్నారని 25వ తేదీ ఉదయం 11 గంటలకు విన్యాసాల ముగింపు కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరుకానున్నారన్నారు. విన్యాసాలకు అన్ని ఏర్పాట్లు చేసామన్నారు. సుమారు లక్ష మంది ఈ విన్యాసాలను వీక్షించే అవకాశముందని కలెక్టర్ తెలిపారు.

amaravati 22112018

ఇవీ ప్రత్యేకతలు... కేవలం 5నాటికన్‌ మైళ్ళ దూరంలోనే విన్యాసాలు మొదలయ్యేలా శ్రీకారం చుడుతున్నారు. ఒక నాటికల్‌ మైల్‌ అంటే 1.38 కిలోమీటర్‌. ఈ లెక్కన 6.9 కిలోమీటర్ల రేడియస్‌ పరిధిలోనే విమానాలు కృష్ణానదిమీదుగా విన్యాసాలు ప్రారంభం చేస్తాయి పరిమిత రేడియ్‌సను నిర్ణయించటం వల్ల కృష్ణానది గగన తలంలోకి రాగానే అతిదగ్గరగా మన కళ్లెదుటే ఉన్నట్టు అనుభూతులను కనిపిస్తాయి. మొత్తం నాలుగు విమానాలు ఆరు రకాల ప్రదర్శనల్లో పాల్గొంటాయి. ఇందులో మొదటి ది ఫార్మేషన్‌ ఎయిర్‌ డిస్‌ప్లే, రెండవది సోలో ఎయిర్‌ డిస్‌ప్లే, ఆ తర్వాత వరుసగా లూప్స్‌, బారెల్‌ రోల్స్‌, క్యూబన్స్‌, టర్న్స్‌ వంటి ప్రదర్శనలు నిర్వహిస్తాయి.

Advertisements