ఐదుకోట్ల మంది ఆంధ్రుల కలల రాజధానికి రూపం ఏర్పడుతోంది. ఆంధ్రప్రదేశ్‌ రాజ ధాని అమరా వతి నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. అమరావతి నిర్మాణ వ్యయాన్ని 70 వేల కోట్లకు పైగా నిర్ధారించినా.. ప్రస్తుతం 39 వేల కోట్ల రూపాయల విలువైన పనులు సాగుతున్నాయి. తెలుగు ప్రజలు అచ్చెరువు పొందేలా ఆకాశ హర్మ్యాలు రూపుదిద్దు కుంటున్నాయి. రాత్రింబవళ్లు వేల సంఖ్యలో కార్మికులు అక్కడ అహరహం శ్రమిస్తున్నారు. నిర్మాణాలన్ని షేర్‌వాల్‌ టెక్నాలజీతో సాగుతున్నాయి. ఈ టెక్నాలజీలో ఇటుకలను వినియోగించరు. పేదలకు ఐదు వేల వరకు నివాసాలు సిద్ధం కావస్తున్నాయి, మొత్తం 61 టవర్లలో 3840 ఫ్లాట్లు సిద్ధం కావాల్సి ఉండగా ఇప్పటికే 1200కు పైగా ఫ్లాట్ల నిర్మాణం దాదాపుగా పూర్తి కావచ్చింది. ఈ ఫ్లాట్లకు ఇంటీరీయర్‌ పనులు ప్రారంభం అయ్యాయి.

amaravati 08012019

విట్‌, ఎస్సారెమ్‌ వంటి విద్యాసంస్థలు ఇప్పటికే కొలువు దీరాయి. హైకోర్టు భవనం శరవేగంగా నిర్మాణమవుతోంది. జనవరి నెలాఖరు నాటికి హైకోర్టు భవనాన్ని ప్రభుత్వం అప్పగించాల్సి ఉంది. ఆలిండియా సర్వీసు అధికారుల టవర్‌కు సంబంధించిన 12 అంతస్తుల నిర్మాణం 80 రోజుల్లో పూర్తయింది. గజిటెడ్‌ అధికారులు, ఎన్జీఓలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల క్వార్టర్ల నిర్మాణం పూర్తి కావస్తోంది. ఏపిసిఆర్డీ యే ప్రధాన కార్యాలయ నిర్మాణ పనులుయే మరో వేపున సాగుతున్నాయి. ముఖ్యంగా రాత్రి సమయాల్లో సాగుతున్న పనులు చూస్తుంటే అక్కడ ఎంతో కోలాహలం కనిపిస్తుంది. సచివాలయం పరిధి లోని సిఎం టవర్‌, హైకోర్టు, మంత్రులు, ఎమ్మెల్యేల, అధికారుల గృహ నిర్మాణ పనుల్లో వేగం పెరిగింది. విద్యుత్‌ కాంతుల వెలుగులో జరుగుతున్న నిర్మాణ పనులతో ఆయా ప్రాంతాలు కళకళలాడుతున్నాయి.

amaravati 08012019

అమరావతి రాజధాని నగరంలో నిర్మాణంలో ఉన్న సెక్రటేరియట్‌, హెచ్‌ఓడి, జీఏడి టవర్ల రాఫ్ట్‌ ఫౌండేషన్‌ రికార్డు సమయంలో పూర్తయింది. 55 గంటల రికార్డు సమయంలో ఫౌండేషన్‌ పూర్తయిందని సైట్‌లొనె సిఆర్డీయే కమిషనర్‌ డాక్టర్‌ శ్రీధర్‌ చెరుకూరి ప్రకటించారు. రాఫ్ట్‌ ఫౌండేషన్‌ పనుల తుది దశకు జీఏడి టవర్‌కు మొత్తం 11వేల 236 క్యూబిక్‌ మీటర్ల కాంక్రీట్‌ను నిరాటంకంగా 55 గంటల్లో వేయడం జరిగింది. దేశంలో ప్రభుత్వ భవనాలకు సంబంధించి ఏకముుెత్తంలో ఇలా చేయడం రికార్డు అని అధికారులు చెప్పారు. ఈ నెల 2వ తేదీ మధ్యాహ్నం తర్వాత జీఏడి టవర్‌ రాఫ్ట్‌ ఫౌండేషన్‌ పనులను కాంట్రాక్ట్‌ సంస్థ ఎన్సీసి ప్రారంభించింది. 500 మంది కార్మికులు, ఇంజనీర్లు మూడు షిఫ్టుల్లో నిరాటంకంగా పనులు సాగించి విజయవంతంగా పూర్తి చేశారు. పనుల నిమిత్తం ఎనిమిది బూమ్‌ ప్రెసర్స్‌ వాడారు.

Advertisements