ఆంద్రప్రదేశ్ ప్రభుత్వ తీరుతో విసిగిపోయిన అమరావతి రైతులు, రేపు కేంద్రం దగ్గర తమ గళం వినిపించడానికి సిద్దం అవుతున్నారు.   ఢిల్లీలోని  జంతర్ మంతర్ దగ్గర రేపు ధర్నా చేయడానికి అమరావతి రైతులు సన్నద్ధం అవుతున్నారు.  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం యొక్క వైఖరిని నిరసిస్తూ, అమరావతి రైతులు డిల్లీలో నిరసన చేయాల నిర్ణయించుకున్నారు. ఈ రోజుతో రాజధాని విషయంపై ప్రభుత్వం తీసుకున్న  నిర్ణయానికి 3 సంవత్సరాలు పూర్తవడంతో,  ధరణికోట నుంచి ఎర్రకోటకు అనే  పేరుతో ఢిల్లీ నడి బొడ్డున  నిరసనలు చేయాలని అమరావతి రైతులు నిర్ణయించుకున్నట్లు , మీడియాకు తెలిపారు. దీనికోసం ప్రత్యేక ట్రైన్ లో  1800  మంది రైతులు ఢిల్లీ వెళ్లినట్టు సమాచారం.  ఈఅమరావతి రైతులఉద్యమానికి  పీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు తన మద్దతును తెలిపారు. అంతే కాకుండా  కాంగ్రెస్ నేతలు కూడా  ఢిల్లీలోచేస్తున్న అమరావతి రైతులు ధర్నాలో పాల్గొననున్నారు.

Advertisements