సీఆర్‌డీఏ నిర్మిస్తున్న గృహ నిర్మాణ ప్రాజెక్టు ‘హ్యాపీనెస్ట్‌’కు రెండో విడత కూడా అనూహ్య స్పందన లభించింది. రెండో విడతలోనూ నిమిషాల వ్యవధిలోనే వందల ఫ్లాట్లను బుక్‌ చేసుకున్నారు. దేశ విదేశాల నుంచి పెద్ద ఎత్తున ఈ ఫ్లాట్లను బుక్‌ చేసుకున్నారు. ఉదయం 9 గంటలకు ప్రారంభమైన ఆన్‌లైన్‌ బుకింగ్‌ ప్రక్రియలో తొలి అరగంటలోనే 700 ఫ్లాట్లకు పైగా బుకింగ్‌ పూర్తయింది. ఇందుకోసం విజయవాడ సీఆర్డీఏ కార్యాలయంలో 60 ఫెసిలేటషన్‌ కౌంటర్లను ఏర్పాటు చేశారు. సోమవారం ఉదయం 9 గంటలకు విజయవాడలోని సీఆర్డీఏ ఆఫీస్‌లో హెల్ప్ డెస్క్‌లను ఏర్పాటు చేయగా.. ఉదయం నుంచి ఫ్లాట్ల కొనుగోలు చేసేందుకు జనాలు క్యూ కట్టారు.

amaravati 10122018 2

రెండో విడత బుకింగ్స్‌లో గంటలోనే ఫ్లాట్లన్నీ (900) బుక్ అయ్యాయి. ఫ్లాట్‌ బుక్‌ చేసుకున్న వినియోగదారురాలకు.. సీఆర్డీఏ కమిషనర్‌ శ్రీధర్‌ ఫ్లాట్‌ బుకింగ్‌ పత్రాన్ని అందించారు. హ్యాపీ నెస్ట్ ప్రాజెక్టులో మొత్తం 1200 ఫ్లాట్లు నిర్మిస్తుండగా 300 ఫ్లాట్లకు గత నవంబరు 9న సీఆర్‌డీఏ ఆన్‌లైన్‌లో బుకింగ్‌ నిర్వహించింది. తొలివిడతలో అనూహ్య స్పందన రావడంతో మిగతా 900 ఫ్లాట్లకు సోమవారం బుకింగ్‌ నిర్వహించారు. మొత్తం హ్యపీనెస్ట్‌లో బుక్‌ చేసుకున్న వినియోగదారులకు 24 నెలల్లోనే ప్రాజెక్టును పూర్తి చేసి అప్పగిస్తామని సీఆర్డీఏ కమిషనర్ శ్రీధర్‌ తెలిపారు.

amaravati 10122018 3

‘హ్యాపీ నెస్ట్‌’పేరుతో సీఆర్డీఏ ఆధ్వర్యంలో రాజధాని అమరావతి పరిధిలోని నేలపాడు సమీపంలో అపార్ట్‌మెంట్లు నిర్మించబోతున్నారు. 12 టవర్లను నిర్మించి అందులో 1200 అపార్ట్‌మెంట్లను అందుబాటులోకి తీసుకురానున్నారు. 15 ఎకరాలలో ఈ ప్లాట్ల నిర్మాణాలను చేపట్టబోతున్నారు. చదరపు అడుగు 3వేల492 రూపాయల వ్యయంతో ఈ గెటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్టును నిర్మిస్తున్నారు. ఒక్కో టవర్ 19 అంతస్తులతో నిర్మాణం కానుంది. ఈ ప్లాట్లకు సీఆర్డీఏ బుకింగ్ ప్రారంభించింది. ప్లాట్ల బుకింగ్ విషయానికొస్తే.. ప్లాట్ ధరలో ముందుగా 7శాతం చెల్లించాల్సి ఉంటుంది. మిగతా డబ్బును నెలవారీ పద్దతిలో కట్టాలి.

Advertisements