అమరావతి... ది పీపుల్స్ కాపిటల్.. చంద్రబాబుని నమ్మి 33 వేల ఎకరాలు ఇచ్చారు రైతులు... చంద్రబాబు వారి నమ్మకాన్ని పాడుచెయ్యకుండా, పని చేస్తున్నారు. వరల్డ్ క్లాస్ యూనివర్సిటీలు, హాస్పిటల్స్, హోటల్స్ వచ్చాయి.. మరో పక్క రోడ్ల నిర్మాణం వేగంగా జరుగుతుంది. మరో పక్క హౌసింగ్ పనులు జరుగుతున్నాయి. మరో పక్క సెక్రటేరియట్ టవర్ల నిర్మాణం ప్రారంభమైంది. అందుకే అమరావతి మీద నమ్మకంతో, బాంబే స్టాక్ ఎక్స్చేంజిలో, ఒక్క గంట లోనే, అమరావతి బాండ్లు ఓవర్ subscribe అయ్యాయి. అమరావతి మీద ఇన్వెస్టర్స్ కి ఎంత నమ్మకం ఉందో ప్రపంచానికి తెలిసింది. ఇప్పుడు సామాన్య ప్రజల వంతు.

amaravati 09112018 2

నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో నిర్మించనున్న ‘హ్యాపీ నెస్ట్‌’ ఫ్లాట్ల బుకింగ్‌ ప్రక్రియ శుక్రవారం ప్రారంభమైంది. నేలపాడు వద్ద చేపట్టే హ్యాపీనెస్ట్‌ ప్రాజెక్టు తొలిదశలో భాగంగా జీప్లస్‌ 18 పద్ధతిలో నిర్మించే 300 ఫ్లాట్లకు ఆన్‌లైన్‌లో బుకింగ్‌ చేసుకునే అవకాశాన్ని సీఆర్‌డీఏ కల్పించింది. ఆన్‌లైన్‌ బుకింగ్‌ చేసుకునే వారికి సహాయపడేందుకు విజయవాడలోని ఏపీ సీఆర్‌డీఏ కార్యాలయంలో ఉదయం 9 గంటల నుంచి 20 హెల్ప్‌ డెస్క్‌లు ఏర్పాటు చేశారు. ఫ్లాట్లు బుకింగ్‌ చేసుకునేందుకు కొనుగోలుదారులు పెద్దసంఖ్యలో కార్యాలయానికి తరలివచ్చారు. లక్ష మందికిపైగా సర్వర్‌తో అనుసంధానం కావడంతో ఆన్‌లైన్‌ ప్రక్రియ నెమ్మదిగా సాగింది. ప్రజల నుంచి ఇంత స్పందన వస్తుందని, సీఆర్డీఏ అంచనా వెయ్యలేక పోయింది. అమరావతి పై సామాన్య ప్రజలకు ఎన్ని ఆశలు ఉన్నాయో, ఈ ఘటన చెప్తుంది.

amaravati 09112018 3

సీఆర్డీఏలో 300 ఫ్లాట్ల విక్రయం పూర్తి అయినట్లు సీఆర్డీఏ కమిషనర్ శ్రీధర్ తెలిపారు. శుక్రవారం మాట్లాడుతూ డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని సాంకేతిక సమస్యలు లేకుండా ఈనెల 15న మరో 300 ఫ్లాట్లను ఆన్‌లైన్‌లో పెడుతున్నామని చెప్పారు. ఈసారి ఎలాంటి సాంకేతిక ఇబ్బందులు రావన్నారు. 24 నెలల్లో ప్రాజెక్టును పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. రాజధాని అమరావతికి ఉన్న ప్రాముఖ్యత ఏంటో ఈ ఫ్లాట్ల విక్రయం ద్వారా తెలిసిపోతోందని ఆయన పేర్కొన్నారు. అనుమతి ఇచ్చారు. అవీ అయిపోతే ప్రాజెక్ట్‌లో మిగిలిన 600అపార్ట్‌మెంట్లకు కూడా బుకింగ్‌ ప్రారంభించాలని సూచించారు.

Advertisements