హార్వర్డ్‌ యూనివర్సిటీ మన అమరావతి రైతుల త్యాగాన్ని గుర్తించింది... అమరావతి ల్యాండ్‌పూలింగ్‌ విధానం ప్రపంచాన్ని ఆకర్షించింది... 34 వేల ఏకరాలు, ఎక్కడా ఆందోళన లేకుండా, ప్రభుత్వం ల్యాండ్‌పూలింగ్‌ ద్వారా తీసుకోవటం, ఒక్క మనిషి పై నమ్మకం ఉంచి రైతులు ఆ భూములు ఇవ్వటం ఇప్పుడు హార్వర్డ్‌ వర్సిటీకి కేస్‌ స్టడీ అయ్యింది... ఈ విషయాన్ని సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నిన్న అధికారులతో చెప్పారు... అమరావతిలో ల్యాండ్ పూలింగ్ విధానాన్ని హార్వర్డ్ యూనివర్సిటీ కూడా కేస్ స్టడీగా తీసుకుంది. ఇది మనకెంతో గర్వకారణం’ అని ఆయనన్నారు...

amaravati 25122017 2

‘రూపాయి కూడా ఖర్చు చేయకుండా రాజధాని నిర్మాణానికి అవసరమైన 34వేల ఎకరాల భూమిని రైతుల నుంచి సేకరించిన విధానంపై రాష్టప్రతికి ప్రత్యేకంగా వివరించాలి. రాష్ట్ర ప్రభుత్వ పిలుపుకి స్పందించి తమ విలువైన భూములను స్వచ్ఛందంగా అందించారు. వారిని చరిత్ర గుర్తుంచుకుంటుంది. అమరావతి ప్రజల రాజధాని. రైతులు నాపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయబోను. రాజధాని కోసం రైతులు ప్రాణప్రదంగా చూసుకునే భూములిచ్చారు. కేవలం ప్రభుత్వంపై నమ్మకంతో అన్నదాతలు చేసిన ఈ త్యాగాలను ఎన్నటికీ మరువబోం’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ‘అమరావతిని ప్రపంచంలోనే అత్యంత సంతోషకరమైన, హాయిగా జీవించగలిగే నగరంగా తీర్చిదిద్దుదాం. రైతులు స్వచ్ఛందంగా ఇచ్చిన భూముల్లో ప్రపంచ శ్రేణి రాజధాని నగరాన్ని నిర్మిస్తాను. అమరావతిలో ల్యాండ్ పూలింగ్ విధానాన్ని హార్వర్డ్ యూనివర్సిటీ కూడా కేస్ స్టడీగా తీసుకుంది. ఇది మనకెంతో గర్వకారణం’ అని చంద్రబాబు అన్నారు.

amaravati 25122017 3

అమరావతిని ప్రపంచంలోనే అత్యద్భుతమైన నగరంగా తీర్చిదిద్దుతామని చెపుతూ, నవ్యాంధ్ర నూతన రాజధాని ఇప్పటికే ప్రపంచం దృష్టిని ఆకర్షించిందన్నారు. పలు దేశాలు ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నాయని తెలిపారు. అమరావతిలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను రాష్ట్ర పర్యటనకు వస్తున్న రాష్టప్రతి రామ్‌నాథ్ కోవింద్‌కు వివరించాలని అధికారులను ఆదేశించారు. ఈ నెల 27న రాష్టప్రతి విజయవాడ రానున్న నేపథ్యంలో ఏర్పాట్లపై ఆయన అధికారులతో సమీక్షించారు. రాష్టప్రతికి అమరావతి చారిత్రక నేపథ్యాన్ని సమగ్రంగా వివరించడంతో పాటు రాజధాని నగరాన్ని ప్రభుత్వం ఎలా అభివృద్ధి చేయబోతోందనే విషయాన్ని కూడా తెలియజేయాలన్నారు.

Advertisements