నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో త్వరలో ఆధునిక మిలటరీ స్టేషన్‌ ఏర్పాటు కానుంది. గురువారం సచివాలయంలో తెలంగాణ, ఏపి సబ్‌ ఏరియా జనరల్‌ కమాండింగ్‌ ఆఫీసర్‌ మేజర్‌ జనరల్‌ శ్రీనివాసరావు ఇన్‌ఛార్జి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్‌ చంద్ర పునేఠతో భేటీ అయ్యారు. అమరావతిలో ఆధునిక మిలటరీ స్టేషన్‌ ఏర్పాటుకు సంబంధించి ఆరున్నర ఎకరాల భూమి కేటాయింపు ప్రక్రియను వేగవంతం చేయాలని ఆయన సిఎస్‌ను కోరారు. విజయవాడ, కర్నూలులో ఎక్స్‌ సర్వీస్‌మెన్‌ కాంప్రహెన్సివ్‌ హెల్త్‌ స్కీమ్‌ ( ఇసిహెచ్‌ఎస్‌ ) పోలీ క్లినిక్‌ల ఏర్పాటుకు స్థలాన్ని నామినల్‌ ధరకు ఇప్పించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు.

amaravati 06072018 2

కోరుకొండ సైనిక్‌ పాఠశాలకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు సకాలంలో విడుదల చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఇసిహెచ్‌ఎస్‌ స్కీమ్‌ కోసం ప్రత్యేక యాప్‌ రూపొందించామని, రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ యాప్‌ను వినియోగించుకునేందుకు ప్రత్యేకంగా లింక్‌ ఇస్తామని, అందుకు అనుమతి ఇవ్వాలని కోరారు. మేజర్‌ జనరల్‌ శ్రీనివాసరావు ప్రతిపాదనల పై సిఎస్‌ సానుకూలంగా స్పందిస్తూ మిలటరీ స్టేషన్‌ ఏర్పాటుకు తగిన స్థలం కేటాయించేదుకు సిఆర్డీయే అధికారులతో మాట్లాడి వేగవంతం చేస్తామని హామీ ఇచ్చారు. ఇతర ప్రతిపాదనలకు సంబంధించి ఎప్పటికప్పుడు సమన్వయం చేసేందుకు వీలుగా ఒక లైజన్‌ అధికారిని ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.

amaravati 06072018 3

కోరుకొండ సైనిక్‌ స్కూల్‌కు విడుదల చేయాల్సిన నిధులపై విద్యా శాఖ అధికారులకు తగిన ఆదేశాలు జారీ చేస్తామని సిఎస్‌ స్పష్టం చేశారు. అలాగే విజయవాడ, కర్నూల్‌లో ఎక్స్‌ సర్వీ్‌సమెన్‌ కాంప్రహెన్సివ్‌ హెల్త్‌ స్కీమ్‌(ఈసీహెచ్‌ఎస్) పాలీ క్లినిక్‌ల ఏర్పాటుకు తగిన స్థలాన్ని నామమాత్రపు ధరకు ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలని మేజర్ కోరారు. గ్యాలంటరీ అవార్డులకు తెలంగాణ నుంచి ఎక్కువ ప్రతిపాదనలు వస్తున్నాయని, ఏపీ నుంచి కూడా వచ్చే విధంగా కృషి చేయాలన్నారు. తెలంగాణ కన్నా ఆంధ్రప్రదేశ్‌లోనే ఎక్స్‌సర్వీ్‌సమెన్లు ఎక్కువగా ఉన్నారని, మిలటరీలో పని చేయడానికి ఆసక్తి చూపే వారి సంఖ్య తెలంగాణతో పోల్చితే, ఏపీలోనే ఎక్కువగా ఉంటోందని చెప్పారు.

Advertisements