అమరావతి నిర్మాణంలో మరొక కిలక ఘట్టం ఆవిష్కృతమైంది. సచివాలయం ఐదు టవర్ల నిర్మాణంలో భాగంగా ర్యాఫ్ట్ ఫౌండేషన్ పనులను ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం ఉదయం ప్రారంభించారు. శాంతి హోమం నిర్వహించిన తర్వాత సరిగ్గా ముహూర్త సమయం 8-50 గంటలకు ర్యాప్ట్ ఫౌండేషన్ పనులు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు, మంత్రులు నారాయణ, ప్రత్తిపాటి, దేవినేని ఉమ, నక్కా ఆనందబాబు, ఎమ్మెల్యే శ్రవణ్‌, స్థానిక నేతలు తదితరులు హాజరయ్యారు. దేశంలోనే తొలిసారి అమరావతిలో ర్యాప్ట్‌ ఫౌండేషన్‌ పనులను చంద్రబాబు ప్రారంభించారు. 11వేల క్యూబిక్‌ మీటర్ల కాంక్రీట్‌తో సచివాలయ టవర్లకు ర్యాప్ట్‌ ఫౌండేషన్‌ వేస్తున్నారు.

amaravati 27122018

13 అడుగుల లోతులో 4 మీటర్ల ఎత్తున ర్యాప్ట్‌ ఫౌండేషన్‌ నిర్మాణం జరుగుతోంది. 72 గంటలపాటు ఏకధాటిగా ఈ పనులు జరగనున్నాయి. ఐదు టవర్లలో సచివాలయం, హెచ్‌వోడీల భవనాలు, డయాగ్రిడ్‌ నమూనాలో ఫ్రేమ్‌ ఆధారంగా టవర్ల నిర్మాణం జరగనుంది. 41 ఎకరాల్లో 69 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో సచివాలయ నిర్మాణం జరుగుతుంది. 50 అంతస్థులతో ఐకానిక్‌గా జీఏడీ టవర్‌ నిర్మాణం జరుగుతుంది. 225 మీటర్ల ఎత్తుతో ప్రపంచంలోనే అతి ఎత్తయిన సచివాలయ భవనం నిర్మించనున్నారు. భూకంపాలు, పెనుగాలుల వంటి ప్రకృతి వైపరీత్యాలను తట్టుకునేలా డిజైన్‌ రూపొందించారు.

amaravati 27122018

నిర్ణీత ప్రాంతం మొత్తాన్ని కాంక్రీట్‌తో నింపే ప్రక్రియనే రాఫ్ట్‌ ఫౌండేషన్‌ విధానంగా పేర్కొంటారు. ఒక రకంగా చెప్పాలంటే స్టీలు, కాంక్రీటుతో అత్యంత పటిష్ఠమైన, మందపాటి కాంక్రీట్‌ దిమ్మెను నిర్మించడమే. సాధారణంగా నేల లోతు నుంచి స్తంభాలు వేసి పునాది నిర్మించాలంటే గుంతలు తవ్వాలి. బోర్లు వేసి స్టీలు పెట్టాలి. కాంక్రీట్‌ పోయాలి.. కనీసం నెలన్నర వ్యవధి పడుతుంది. అదే రాఫ్ట్‌లో అయితే మూడు రోజుల్లో పునాది వేయొచ్చు. ఫైల్‌ విధానంతో పోలిస్తే ఖర్చు ఎక్కువైనా నిర్మాణం పటిష్ఠంగా ఉంటుంది. సచివాలయ భవనాలకే రాఫ్ట్‌ ఫౌండేషన్‌లో పునాది వేస్తున్నారు. 72 గంటలపాటు నిరాటంకంగా పనులు చేస్తారు. మూడోపార్టీగా వ్యవహరిస్తున్న ఐఐటీ చెన్నై నిపుణులు కాంక్రీట్‌మిక్స్‌ను డిజైన్‌ చేశారు. భారీ యంత్రాల వినియోగం... 60, 40 టన్నుల సామర్థ్యపు క్రేన్లు, 10 మీటర్ల వరకు వినియోగించే హైడ్రాస్‌, కాంక్రీట్‌ వేసే నాలుగు పంపులు, 30 ట్రాన్సిట్‌ మిక్సర్లు (అందుబాటులో అదనంగా మరో ఆరు).

Advertisements