అమరావతి మీద కొంత మంది నిత్యం ఎలా విషం చిమ్ముతున్నారో చూస్తూనే ఉన్నాం... హైదరాబాద్ నున్చివ్ వచ్చి మరీ, ఇక్కడ ప్రజలను రెచ్చగొట్టి, మళ్ళీ సాయంత్రం ఫ్లైట్ లో హైదరాబాద్ పోయే బ్యాచ్, అమరావతిని తక్కువ చేసి మాట్లాడుతూ ఉండటం చూస్తున్నాం... మరో పక్క, అమరావతి ఒక్కే మెట్టు ఎక్కుతూ వెళ్తుంది.. అమరావతికి ఇండియన్‌ గ్రీన్‌ బిల్డింగ్‌ కౌన్సిల్‌ (ఐజీబీసీ) అందజేసే ప్రతిష్టాత్మకమైన ఐజీబీసీ గ్రీన్‌ ప్లాటినం పురస్కారం లభించింది. ఐజీబీసీ గ్రీన్‌ న్యూ సిటీ రేటింగ్‌ ప్రోగ్రాంలో భాగంగా అమరావతి దీనికి ఎంపికైంది. భారతదేశంలో పూర్తిస్థాయిలో ఒక నగరానికి ఐజీబీసీ పురస్కారం లభించడం ఇదే ప్రథమం. ఇంతకు ముందు చిన్న ప్రాంతమైన గుజరాత్‌ ఇండస్ట్రియల్‌ గిఫ్ట్‌ సిటీ దీనిని అందుకుంది.

amaravati 09042018

ఈ నెల 10వ తేదీ నుంచి అమరావతిలో మొదలవనున్న సంతోష నగరాల సదస్సు ప్రారంభ కార్యక్రమంలో ఏపీసీఆర్డీయే కమిషనర్‌ డాక్టర్‌ చెరుకూరి శ్రీధర్‌ ఐజీబీసీ చైర్‌పర్సన్‌ ప్రేమ్‌.సి.జైన్‌ నుంచి ఈ పురస్కారాన్ని అందుకోనున్నారు. పర్యావరణహితంగా, బ్లూ గ్రీన్‌ కాన్సె్‌ప్టతో రూపుదిద్దుకున్న అమరావతికి సంబంధించిన వివరాలను ఐజీబీసీ రేటింగ్‌ కోసం సీఆర్డీయే ఐజీబీసీకి సమర్పించగా, 100 పాయింట్లకుగాను 78 లభించాయి. క్రెడిట్‌ రేటింగ్‌లో వందకు కనీసం 74 పాయింట్లు రావాల్సి ఉంటుంది. అమరావతి నగర ప్రణాళిక, జోనింగ్‌ నిబంధనలు, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ప్రణాళిక, ట్రాన్స్‌పోర్ట్‌ ప్లాన్‌, బ్లూ గ్రీన్‌ నెట్‌వర్క్‌, జలసంరక్షణ, నీటి పునర్వినియోగం, ఇంధన సామర్ధ్యం, సంప్రదాయేతర వనరుల వినియోగం ఇత్యాది అంశాలు ఐజీబీసీ పురస్కారం లభించేందుకు దోహదపడ్డాయి.

amaravati 09042018

అమరావతికి ప్లాటినం సిటీగా గుర్తింపు రావడం సంతోషకరమని ముఖ్యమంత్రి చంద్రబాబు ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ఇండియన్‌ గ్రీన్‌ బిల్డింగ్‌ కౌన్సిల్‌(ఐజీబీసీ) ఈ రేటింగ్‌ను ఇచ్చింది. మొత్తం నగరానికే ప్లాటినం సిటీగా రేటింగ్‌ ఇవ్వడం ఇదే మొదటిసారి. దేశంలోని నగరాల నిర్మాణ ప్రణాళిక, పచ్చదనం, బహిరంగ స్థలాలు, వేడిని తగ్గించే చర్యలు, పర్యావరణ అంశాలను పరిగణలోకి తీసుకుని ఈ రేటింగ్‌ ఇచ్చినట్లు సీఎం తెలిపారు. విజయవాడ సమీపంలోని సీకే కన్వెన్షన్‌ సెంటర్‌లో ఈ నెల 10 నుంచి మూడు రోజులపాటు నిర్వహించనున్న సంతోషనగరాల సదస్సుపై ఆదివారం సీఆర్‌డీఏ అధికారులతో సీఎం టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. అమరావతి కోసం 34 వేల ఎకరాలు ప్రభుత్వానికి అందజేసిన రైతుల త్యాగాల గురించి సదస్సులో అంతర్జాతీయ ప్రతినిధులకు వివరించాలని, అమరావతి అభివృద్ధికి సూచనలు తీసుకోవాలని ప్రత్యేకంగా సూచించారు.

Advertisements