హోం శాఖ సహాయమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తొలిరోజే జి.కిషన్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలతో ఇబ్బందిలో పడ్డారు. హైదరాబాద్‌ను ఉగ్రవాదులకు సేఫ్ జోన్‌గా కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. దీంతో హోం శాఖ మంత్రిగా శనివారంనాడే బాధ్యతలు చేపట్టిన అమిత్‌షా తన డిప్యూటీని మందలించినట్టు తెలుస్తోంది. దేశంలో ఎక్కడ ఉగ్రవాద కార్యకలాపాలు దొరికినా మూలాలు హైదరాబాద్‌లో కనిపిస్తున్నాయని కిషన్ రెడ్డి వ్యాఖ్యనించడం విమర్శలకు తావిచ్చింది. బెంగళూరు, భోపాల్ సహా ఎక్కడ ఉగ్ర ఘటనలు జరిగినా మూలాలు హైదరాబాద్‌లో కనిపిస్తున్నాయని, హైదరాబాద్‌లో ప్రతి 2-3 నెలలకు ఉగ్రవాదులను రాష్ట్ర పోలీసులు, ఎన్ఐఏ అరెస్టు చేస్తున్నారని చెప్పారు.

amitshah 01062019

కాగా, ఆయన వ్యాఖ్యలపై మజ్లిస్ చీఫ్ ఒవైసీ మండిపడ్డారు. ‘‘మంత్రి బాధ్యతలు చేపట్టకుండానే కిషన్‌ రెడ్డి హైదరాబాద్‌పై ఇటువంటి వ్యాఖ్యలు చేయడం బాధ్యతారాహిత్యం. ఎన్‌ఐఏ ఎన్నిసార్లు ఈ మాటను లిఖితపూర్వకంగా చెప్పిందో వెల్లడించాలి. బెంగళూరు తర్వాత హైదరాబాద్‌ అత్యధిక సాఫ్ట్‌వేర్‌ ఎగుమతులు చేస్తోంది. ఈ నగరంతో ఆయనకు శతృత్వం ఏమిటీ? ఆయనకు హైదరాబాద్‌ ఎదగడం ఇష్టంలేదు. ఆయన అబద్ధాలు చెబుతున్నారు. ఐసిస్‌ సభ్యులు అత్యధికంగా ఉత్తరప్రదేశ్‌లో పట్టుబడ్డారు.. మరి అది ఉగ్రవాదుల అడ్డా అని చెప్పగలరా..? బాధ్యతారాహిత్యమైన మాటలు మాట్లాడకూడదు.’’ ‘‘మూడు వందల సీట్లు గెలిస్తే ముస్లింలను ద్వితీయ శ్రేణి పౌరులు చేస్తారా..? పోనీ అదే చెప్పండి. భారత్‌ ప్రభుత్వం రాజ్యంగం ప్రకారం పనిచేయాలి. రాజ్యాంగానికి ఎవరూ అతీతులు కాదుగా. గత మోదీ ప్రభుత్వంలో లవ్‌ జిహాద్‌, ఘర్‌ వాపసీ, మూకదాడులు, దళితులపై దాడులు మొదలయ్యాయి. మీరు రాజ్యాంగాన్ని సక్రమంగా అమలు చేయలేకపోతే మేము చట్టప్రకారం పోరాడతాము.’’

 

amitshah 01062019

‘‘మోదీ ఒకటి మాట్లాడుతారు.. కిషన్‌ రెడ్డి మరొకటి మాట్లాడుతారు.. మోదీ ఒకటి చెబుతారు.. వీహెచ్‌పీ మరొకటి చెబుతుంది.. మోదీ ఒకటి చెబుతారు.. గిరిరాజ్‌ మరోకటి చెబుతారు. మోదీ ఒకటి చెబుతారు.. యోగా బాబా ఇంకోటి చెబుతారు.. గందరగోళం సృష్టించడానికి ఇదొక వ్యూహం. చాలా చెబుతారు.. కానీ ఆచరించరు. నిన్న వచ్చిన నిరుద్యోగ డేటా ఉద్యోగాలు తగ్గిపోయాయని చెబుతోంది. ప్రజలను అసలు సమస్యలు చూడకుండా చేస్తారు. తెలంగాణలో కేసీఆర్‌ నాయకత్వం మంచి పనులు చేస్తోంది. ఇక్కడి భినత్వంలో ఏకత్వాన్ని నమ్మే సంస్కృతి ఉంది. ఇక్కడ భాజపా, ఆర్‌ఎస్‌ఎస్‌లు విజయం సాధించవు’’ అని అసద్‌ పేర్కొన్నారు.

Advertisements