నాలుగేళ్ల పాలనలో ఏమి చేశామని మళ్లీ ప్రజలను ఓట్లు ఎలా అడుగుతామని ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే ఆనం రామ‌నారాయ‌ణ‌రెడ్డి జ‌గ‌న్ స‌ర్కారుపై మ‌రోసారి తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. ముందస్తు ఎన్నికలకు వెళితే వైసీపీ ఇంటికి వెళ్లడం ఖాయమని జోస్యం చెప్పారు. ప్రజలు వైసీపీకి అధికారం ఇచ్చి ఐదు ఏళ్ళు పూర్తి కావస్తోంద‌ని, కానీ ఇంకా సచివాలయ నిర్మాణాలు పూర్తి కాలేద‌న్నారు. సాంకేతిక కారణాలా లేక.. బిల్లులు చెల్లింపులు ఆలస్యమవుతుందని కట్టడానికి ఎవ‌రూ ముందుకు రావడం లేదా.. తెలియడం లేదన్నారు. ఈ విషయాన్ని ఎమ్మెల్యేలు, నాయకులు గుర్తించుకోవాల‌న్నారు. రాష్ట్రంలో రోడ్లు పరిస్థితి చాలా దారుణంగా ఉంద‌న్నారు. నియోజకవర్గంలో వందల కోట్ల రూపాయల కేంద్ర ప్రభుత్వ నిధులతో రోడ్లు వేస్తున్నామ‌ని, కేంద్ర ప్రభుత్వ నిధులతోనే వాగుల వద్ద హై లెవెల్ బ్రిడ్జిలు కట్టబోతున్నామ‌న్నారు. రాష్ట్రం వేయ‌లేని రోడ్డు కేంద్రం వేస్తుంద‌ని ఆనం చెప్ప‌డం పార్టీ మార్పు సంకేతాలేనంటున్నారు.

Advertisements