కృష్ణా జిల్ల మల్లవల్లిలోని, మోడల్‌ ఇండస్ర్టియల్‌ పార్క్‌లో పనులు ప్రారంభించటానికి ప్రముఖ ఆటోమొబైల్‌ దిగ్గజం అశోక్‌ లే ల్యాండ్ సిద్ధమవుతుంది... భారీ వాహనాల ఉత్పత్తిలో ప్రపంచంలో మూడవ స్థానంలో ఉన్న అశోక్‌ లేలాండ్‌ కంపెనీ బాడీ బిల్డింగ్ ఏర్పాటుకు ముందుకొచ్చిన సంగతి తెలిసిందే... గతంలో తెలంగాణ ప్రభుత్వంతో చర్చలు జరిపి సీఎంతో కుదుర్చుకున్న అవగాహనా ఒప్పందం వదులుకుని, మరీ ఆంధ్రప్రదేశ్ వచ్చింది అశోక్‌ లేలాండ్‌ ... దీనికి ఎన్నో కారణాలు కూడా ఉన్నాయి... ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక విధానం ఒకటైతే, పారిశ్రామికవేత్తలని చంద్రబాబు లాంటి మ్యగ్నేట్ ఉండే ఉన్నారు...

ashok leyland 15022018 2

అయితే, ఇప్పుడు అశోక్‌ లే ల్యాండ్ ఇక రంగంలోకి దిగుతుంది... మార్చి నెలలో భూమిపూజ కార్యక్రమాన్ని నిర్వహించటానికి కంపెనీ ప్రతినిధులు రెడీ అవుతున్నారు... సియం షడ్యుల్ ని బట్టి, ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని ఆహ్వానించి, ఆయన చేతులమీదుగా భూమి పూజ జరిపించాలని నిర్ణయించారు.. అశోక్‌ లేలాండ్‌ స్థాపిస్తున్న యూనిట్‌ కోసం రాష్ట్ర ప్రభుత్వం 75 ఎకరాల భూములకు కేటాయించింది. ఎకరానికి రూ.16.50 లక్షల చొప్పున మొత్తం రూ.12.37 కోట్లను ఏపీఐఐసీకి.. అశోక్‌ లేలాండ్‌ చెల్లించింది. దీంతో ఏపీఐఐసీ అధికారులు కొద్దిరోజుల కిందట ఈ సంస్థతో సేల్‌డీడ్‌ రాసుకున్నారు...

ashok leyland 15022018 3

అశోక్‌లేలాండ్‌ సంస్థకు ఇది అత్యంత ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు...అందువల్లనే మల్లవల్లి ఇండస్ర్టియల్‌ పార్క్‌ను ప్రకటించాక, అందరికంటే ముందుగా ఈ సంస్థే స్పందించింది. దాదాపుగా ఏడాది కిందటే విజయవాడలో బాడీ బిల్డింగ్‌ యూనిట్‌ను ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. మల్లవల్లి అందుకు అనుగుణంగా ఉండటంతో ఇక్కడ 100 ఎకరాల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదన చేసింది. ఆ తరువాత 75 ఎకరాలు సరిపోతాయని పేర్కొంది. ఈ మేరకు ప్రభుత్వం ఆ సంస్థకు భూములు కేటాయించింది.

Advertisements