రాజకీయాల్లో ఎన్నో విమర్శలు చూస్తూ ఉంటాం... చాలా పర్సనల్ గా తిట్టుకుంటారు... విజయసాయి రెడ్డి, జగన్ లాంటి వారి నోటికి ఎలాంటి మాటలు వస్తాయో కూడా తెలీకుండా తిడతారు... ఇవన్నీ ఒకెత్తు అయితే, ఎప్పుడో సంవత్సరాల క్రితం చెప్పిన మాట పట్టుకుని, వారాలు వారాలు అదే మాట చెప్పటం మాత్రం ఇప్పుడే చూస్తున్నాం... అశోక్ గజపతి రాజు గారు, దాదాపు సంవత్సరం క్రితం, విలేకరులు ఎదో అడగగా "పవన్ కళ్యాణ్ అంటే ఎవరో నాకు తెలీదు" అన్నారు.. అది కూడా పవన్ కళ్యాణ్ మన రాష్ట్ర ఎంపీలను, మంత్రులను, పార్లమెంట్ లో గోడలు చూడటం తప్ప ఏమి చెయ్యరు అని అంటే, ఆ విషయం విలేకరులు రాజు గారి దగ్గర ప్రస్తావిస్తూ, మీ రియాక్షన్ ఏంటి అంటే, అప్పుడు అన్నారు, పవన్ అంటే ఎవరో నాకు తెలీదు అని...

ashok 28012019

ఆ వెంటనే దీని పై పవన్ కళ్యాణ్ స్పందిస్తూ, నేను తెలీదు అంటారా అని ఎదో నాలుగు మాటలు అన్నారు... ఇలాంటి విమర్శలు, ప్రతి విమర్శలు చాలా సహజం... అయితే, సంవత్సరం క్రితం అయిపోయిన విషయం తీసుకువచ్చి, పవన్ కళ్యాణ్, మళ్ళీ తన పోరాట యాత్రలో మొదలు పెట్టారు.. నేను తెలియదు అంటారా అంటూ ఊగిపోయాడు. అయితే ఇప్పుడు మళ్ళీ, తాజాగా.. మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి.. పవన్ కళ్యాణ్ తనకు తెలియదని మరోసారి చెప్పుకొచ్చారు. " నేను సినిమాలు చూడను. పవన్ కళ్యాణ్ అన్నయ్య చిరంజీవి తెలుసు. పవన్ కళ్యాణ్ వాళ్ల నాన్న కూడా నాకు తెలుసు. ఎక్సైజ్ శాఖలో పనిచేస్తున్నప్పుడు పవన్ తండ్రి ఒక పనికోసం నా దగ్గరకొస్తే చేసిపెట్టాను" అని ఎంపీ అశోక్‌గజపతి వ్యాఖ్యానించారు.

ashok 28012019

అశోక్ మాటలు విన్న జనసేన కార్యకర్తలు, మెగాభిమానులు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. మళ్ళీ నాగబాబు వీడియోలు చేస్తారు జాగ్రత్తా అంటూ అశోక్ గజపతి రాజు గారిని హెచ్చరిస్తున్నారు. మరో పక్క, దగ్గుబాటి వెంకటేశ్వరరావు.. వైసీపీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌ మోహన్‌రెడ్డితో భేటీ అయిన సంగతి తెలిసిందే. అయితే ఈ భేటీని పలువురు తీవ్రంగా తప్పుపడుతుండగా.. మరికొందరు మాత్రం సమర్థిస్తున్నారు. అశోక్‌గజపతి రాజు మాట్లాడుతూ.. "దగ్గుబాటి వెంకటేశ్వరరావు జగన్‌ను కలవటం ఆయన విజ్ఞత. ప్రభుత్వంపై దగ్గుబాటి విమర్శలు కూడా ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నాం. ప్రతి పనిలో మంచి, చెడు రెండూ ఉంటాయి. గతంలో దగ్గుబాటితో కలసి పనిచేశాను. ఎవరు ఎవర్ని కలసినా టీడీపీదే విజయం "అని అశోక్‌గజపతిరాజు జోస్యం చెప్పుకొచ్చారు.

Advertisements