ఏపీలో ఎమర్జెన్సీ పాలన సాగుతోంద‌ని నంద‌మూరి న‌ట‌సింహం బాల‌య్య ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. తిరుప‌తిలో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ ఏపీలో పరిస్థితులు ఏమీ బాగాలేవ‌న్నారు. ఈ విష‌యాలు నేను హిందూపురం ఎమ్మెల్యేగా, టిడిపి నేత‌గా చెప్ప‌డం లేద‌ని సామాన్య పౌరుడిగా చెప్తున్నాన‌న్నారు. ప్ర‌భుత్వం ఎన్ని అవాస్త‌వాలు ప్ర‌చారంచేసినా వాస్తవాలు ప్రజలకు బాగా తెలుసు అని పేర్కొన్నారు.  కరోనా వల్ల మూడేళ్లుగా నారావారిపల్లెకు రాలేకపోయాయ‌ని, సంక్రాంతి సంద‌ర్భంగా రావ‌డం నారావారిపల్లెకు రావడం సంతోషంగా ఉంద‌న్నారు. ఆకలిగా ఉన్న ప్రేక్షకులకు మంచి సినిమాను అందించామ‌ని, వీరసింహారెడ్డి భారీ విజయం సాధించింద‌ని బాలకృష్ణ తెలిపారు. సినిమాకు ఘనవిజయం అందించిన ప్రజలకు ధన్యవాదాలు చెప్పారు. మంచి సినిమాను ప్రేక్షకులు ఎల్లప్పుడూ ఆదరిస్తారని మరోసారి రుజువు చేశార‌ని బాలకృష్ణ సంతోషం వ్య‌క్తం చేశారు.

Advertisements