నూతన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సీఎం చంద్రబాబు, స్పీకర్ కోడెల శివప్రసాదరావు చేస్తున్న సేవలను బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా, లోక్ సభ స్పీకర్ శ్రీ శిరుమీన్ చౌదరి కోనియాడారు. బంగ్లాదేశ్ రాజధాని డాకాలో ఈ నెల 5నుండి 7వరకూ మూడురోజుల పాటు జరుగుతున్న కామన్వెల్త్ పార్లమెంటరీ సదస్సులో బంగ్లా ప్రధాని, బంగ్లా లోక్ సభ స్పీకర్, భారతదేశ లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహజన్ తో కలసి వేదిక పంచుకున్నారు. 

bangaladesh 07112017 2

ఈ వేదికపై స్పీకర్ కోడెల మాట్లాడుతూ భారతదేశం లో మోడీ నాయకత్వంలో స్వచ్చభారత్, సీఎం చంద్రబాబు సూచనలకు అణుగుణంగా స్వచ్చ ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న మరుగుదొడ్లు, శ్మశానవాటికలు, వెనుకబడిన గ్రామాల్లో మౌలికవసతుల కల్పను, విధివిధానాలను, ప్రత్యేకంగా సత్తెనపల్లి, నరసరావుపేట నియోజకవర్గాల పరిధిలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను వివరించడం జరిగింది.

bangaladesh 07112017 3

స్పీకర్ కోడెల స్పీచ్ విన్న బంగ్లా ప్రధాని, స్పీకర్ భారతదేశంతో పాటు ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ గురించి ఎన్నో విషయాలు తెలుసుకునే అవకాశం కలిగిందన్నారు. స్వచ్చ ఆంధ్రప్రదేశ్ లో , సత్తెనపల్లి నరసరావుపేట ప్రాంతాల్లో అమలు చేస్తున్న విధివిధానాలు బంగ్లాదేశ్ లో కూడా అమలుచేయడానికి ప్రయత్నిస్తామని... ఆ విధివిధానాలు తమకు అందించాలని కోరారు. ఈ సదస్సులో పాల్గొనేందుకు వివిధ దేశాల నుంచి అక్కడకు వచ్చిన ప్రతినిధులు నూతన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నెంబర్ వన్ స్థానంలో నిలపడానికి కృషి చేస్తున్న సీఎం చంద్రబాబు, సత్తెనపల్లి, నరసరావుపేట నియోజకవర్గాలను నెంబర్ వన్ స్థానంలో నిలిపిన స్పీకర్ కోడెల శివప్రసాదరావు అభినందించారు.

Advertisements