విజయవాడలో ప్రజల ట్రాఫిక్‌ కష్టాలను దృష్టిలో ఉంచుకుని బెంజిసర్కిల్‌ ఫ్లై ఓవర్‌ను నిడమానూరు వరకు పొడిగించటం అవసరమని భావించిన కలెక్టర్‌ లక్ష్మీకాంతం, గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబుకు పొడిగింపునకు ప్రతిపాదించారు. విజయవాడ నగరంలో సీఎం చంద్రబాబు ఆకస్మికంగా తనిఖీలు చేసిన సందర్భంలో ఎన్‌హెచ్‌ - 16 ను విస్తరించటానికి సర్వే చేయాల్సిందిగా ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈ క్రమంలో జిల్లా యంత్రాంగం ఎన్‌హెచ్‌- 16 విస్తరణకు సంబంధించి సర్వే చేపట్టింది. భూసేకరణ కంటే ఫ్లై ఓవర్‌ పొడిగించటం ద్వారానే ప్రభుత్వం పై భారం తక్కువుగా ఉంటుందని భావించిన జిల్లా యంత్రాంగం ఈ మేరకు ముఖ్యమంత్రి దృష్టికి ప్రతిపాదన తీసుకు వెళ్లారు.

benz 011102018

 దీనిపై ప్రభుత్వ స్థాయిలో నిర్ణయం తీసుకోలేదు. అమెరికా నుంచి ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత సీఎం నివాసానికి వెళ్లిన కలెక్టర్‌ దీనిపై ముఖ్యమంత్రి దగ్గర ప్రస్తావించారు. సీఎం దీనిపై సానుకూలంగా స్పందించి ముందుకు వెళ్లాలని మౌఖికంగా కలెక్టర్‌కు సూచించారు. జాతీయ రహదారుల సంస్థ ఎంత వరకు భరించగలదో చూసి, మిగిలినది రాష్ట్ర ప్రభుత్వం భరించటానికి తన సంసిద్ధతను కలెక్టర్‌కు ముఖ్యమంత్రి తెలిపినట్టు సమాచారం. వెంటనే దీనికి సంబంధించిన పూర్తి ప్రతిపాదనలను పంపవలసిందిగా సీఎం కోరినట్టు సమాచారం.

benz 011102018

 బెంజిసర్కిల్‌ ఫ్లైఓవర్‌ ఎస్‌వీఎస్‌ జంక్షన్‌దగ్గర ప్రారంభమై నుంచి రమేష్‌ హాస్పిటల్‌ జంక్షన్‌దగ్గర 1.4 కిలోమీటర్ల దూరంలో ఎండ్‌ అవుతుంది. ఇక్కడి నుంచి నిడమానూరు వరకు దాదాపుగా 5 కిలోమీటర్ల దూరం ఉంది. ఈ ఐదు కిలోమీటర్ల దూరానికి దాదాపుగా రూ. 500 కోట్ల మేర అంచనా వ్యయం అవుతుందని జిల్లా యంత్రాంగం భావిస్తోంది. బెంజిసర్కిల్‌ ఫ్లై ఓవర్‌ ప్రస్తుత మొదటి వరుసను 1.4 కిలోమీటర్ల దూరానికి రూ. 75 కోట్ల వ్యయంతో చేపడుతున్నారు. అయితే ఈ కసరత్తు అంతా పూర్తయ్యి, ఈ ప్రతిపాదన పట్టాలు ఎక్కాలి అంటే, ఎన్నికలు అయిన తరువాతే ముందుకు వెళ్ళే అవకాసం ఉంది.

Advertisements