చచ్చి అయినా సాదిస్తాను అనే మాట మనం ఎక్కువగా వింటూఉంటాం.. ఆ మాటని భూమా నాగిరెడ్డి గారు ఇవాళ నిజం చేసేరు... ఒక మనిషి సంకల్పం గొప్పది అయితే, వారు చనిపోయినా, ఆ సంకల్పం నెరవేరుతుంది అనటానికి ఇది ఒక ఉదాహరణ....
తన కుటుంబానికి దశాబ్దాల కాలంగా అండగా ఉంటున్న తమ ప్రజల కోసం చంద్రబాబు గారిని కలిసి, అన్నా నా నియోజికవర్గంలో పేదలు ఎక్కువ, కనీసం పడుకోవటానికి కూడా ఇల్లు లేని పేద ముస్లింలు ఎంతో మంది ఉన్నారు... నియోజికవర్గానికి 10000 ఇల్లు కావాలి అని కోరటం జరిగింది... తనకి ప్రజలు చాలా చేసేరు వాళ్ళకి తిరిగి ఏదోఒకటి చేయాలని, చంద్రబాబు గారిని ఒప్పించారు. ఇంత పెద్ద ఎత్తున ఒకే నియోజికవర్గానికి ఇన్ని ఇల్లు ఎప్పుడూ కేటాయించలేదు.... చనిపోయే ముందు రోజు కూడా, అక్కడ ఉన్న నంద్యాలలోని అన్ని వర్గాల ప్రజల ప్రతినిధులని తీసుకువెళ్ళి, ఇల్లు కోసం, రోడ్ల విస్తరణ కోసం, సహకరిస్తాం అని, వెంటనే నిధులు కేటాయించమని చంద్రబాబుని కోరుకున్నారు. అనుకోకుండా హామీ పొందిన తరువాత రోజు తిరిగిరాని లోకాలకి వెళ్లి పోయారు భూమా నాగి రెడ్డి.
భూమా నాగిరెడ్డి చివరి కోరిక అయినా నంద్యాల నియోజికవర్గ ప్రజలు కి ఇచ్చిన హామీని చంద్రబాబు గారు అమలపరుస్తున్నారు. ఇంత పెద్ద ఎత్తున రోడ్లు విస్తరణ జరుగుతుంటే,ఒక్కటంటే ఒక్క నిరసన లేదు... రోడ్ల విస్తరణలో ఇళ్లు, దుకాణాలు కోల్పోయిన బాధితులకు ప్రభుత్వం పెద్ద ఎత్తున నష్ట పరిహారం చెల్లించింది... ప్రజలు సైతం స్వచ్ఛందంగా ముందుకొచ్చి రోడ్ల విస్తరణకు సహకరించారు... తన తండ్రి ని గుండెలో పెట్టుకున్న నియోజిక ప్రజల కోసం కష్టపడుతున్న అఖిలకి అండగా నిలపడుతున్నారు నంద్యాల ప్రజలు..
అందుకే మన పెద్దలు అనేది, మన సంకల్పం గొప్పది, పది మందికి ఉపయోగపడేది అయితే, నీ కృషి తప్పకుండా ఫలిస్తుంది అని. ఇక్కడ భుమా నాగిరెడ్డి చనిపోయినా, ఆయన అనుకున్నది సాధిస్తున్నారు అంటే, ప్రజలకు మంచి చెయ్యాలి అనే, ఆయన సంకల్పం అంత గొప్పది...