వచ్చే ఎన్నికల్లో వైసీపీకి గుణపాఠం చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని టీడీపీ అధ్యక్షుడు ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. నేడు పార్టీ నేతలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏపీపై ద్వేషం చూపిన కేసీఆర్, కేటీఆర్‌లు జగన్‌పై ప్రేమ చూపుతున్నారని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో సామంతరాజు వ్యవస్థను తీసుకురావాలన్నదే వారి ఆలోచన అని చంద్రబాబు మండిపడ్డారు. ప్రధాని మోదీ, కేసీఆర్, జగన్‌లు రూ.1000 కోట్ల ప్యాకేజీతో కుట్రలు ప్రారంభించారని.. చంద్రబాబు ఆరోపించారు. రాష్ట్రాన్ని మరో బీహార్ చేసేందుకు ప్రశాంత్ కిషోర్ సాయంతో కుట్ర చేస్తున్నారని ఆరోపించారు.

pk 250222019

కుల రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారని ఆయన మండిపడ్డారు. కులరాజకీయాలను ఏపీ ప్రజలంతా వెలివేయాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధే టీడీపీ లక్ష్యమన్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధినీ, ప్రజల మంచిని కోరుకునేవారు టీడీపీలో చేరుతున్నారని.. అవినీతిని కాంక్షించేవారు టీడీపీ వైపు మొగ్గు చూపుతున్నారని చంద్రబాబు చెప్పారు. ఇప్పటి వరకూ 7 పార్లమెంట్ నియోజకవర్గాల్లో సమీక్షలు పూర్తి చేసుకున్నామని.. గెలుపు గుర్రాలపై అభ్యర్తులుగా నిలబెడుతున్నామని ఆయన తెలిపారు. మరోవైపు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రత్యేక పోటీకి దూరంగా ఉండాలని నిర్ణయించినట్టు సీఎం చంద్రబాబు పార్టీ నేతలకు వివరించారు.

pk 250222019

ఏపీని కేసీఆర్‌ తోలుబొమ్మ చేసి ఆడుకోవాలనుకుంటున్నారన్నారు. రాష్ట్రాన్ని మరో బిహార్‌ చేసేందుకు ప్రశాంత్‌ కిషోర్‌ సాయంతో కుట్ర చేస్తున్నారన్నారు. నలభై ఏళ్ల తన రాజకీయ జీవితంపై కులముద్ర వేసే సాహసం ఎవరూ చేయలేదని... ఇప్పుడు జగన్‌ అతి దుర్మార్గమైన ప్రచారం ప్రారంభించారని చంద్రబాబు మండిపడ్డారు. ‘‘విజయభాస్కర్‌ రెడ్డి, చెన్నారెడ్డి, రాజశేఖర్‌ రెడ్డి, ఇందిరాగాంధీలాంటి ఎంతోమందితో పోరాడాను. మొదటిసారి.. జగన్‌ తనకుండే కులగజ్జిని నాకు అంటించాలని చూస్తున్నారు. జగన్‌కు సలహాదారు బీహారీ ప్రశాంత్‌ కిశోర్‌. బీహార్‌, యూపీ తరహాలో కుల రాజకీయాలు చేయాలని చూస్తున్నారు. కులాలు, మతాల మధ్య చిచ్చు పెట్టాలని ప్రయత్నిస్తున్నారు. జగన్‌, ప్రశాంత్‌ కిశోర్‌ల కుప్పిగంతులు నా దగ్గర కుదరవు’’ అని చంద్రబాబు తెలిపారు.

 

 

Advertisements