మోడీతో డీ కొట్టేందుకు, ఢిల్లీ వచ్చిన చంద్రబాబు, పలువురు నేతలను కలుస్తూ, రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని వివరిస్తూ ఢిల్లీ పర్యటన కొనసాగిస్తున్నారు... ఈ క్రమంలో, పలువురు బీజేపీ నేతలు, కేంద్ర మంత్రులు కూడా చంద్రబాబు వద్దకు వచ్చి ఆయన్ను కలిసి, ఫోటోలు దిగి మరీ వెళ్లారు... బీజేపీ సీనియర్‌ నాయకుడు మురళీ మనోహర్‌ జోషి... పార్లమెంటు సెంట్రల్‌ హాలులో ఉన్న చంద్రబాబు వద్దకు వచ్చారు. సీఎం ఆయనకు నమస్కరించగా జోషి నవ్వుతూ ఆయన చేతుల్ని పట్టుకున్నారు. ఇద్దరూ కొద్దిసేపు సరదాగా మాట్లాడుకున్నారు. రాష్ట్రానికి ఇచ్చిన హామీలను మోదీ ప్రభుత్వం నెరవేర్చలేదని, తమకు చాలా అన్యాయం జరిగిందని చంద్రబాబు తెలిపారు. ‘మీ ఆవేదనను నేను అర్థం చేసుకోగలను’ అని జోషి స్పందించారు.

cbn 04042018 2

కేంద్ర పట్టణాభివృద్ది మంత్రి హర్దీప్‌ సింగ్‌ పూరీ(బీజేపీ) కూడా చంద్రబాబుతో మాట్లాడారు. ‘‘వెంకయ్యనాయుడు ఉపరాష్ట్రపతిగా నియమితులైన తర్వాత నేను మంత్రి పదవి చేపట్టాను. గతంలో నేను కేంద్ర ప్రభుత్వంలో జాయింట్‌ సెక్రటరీగా ఉన్నప్పుడే మీ గురించి విన్నాను. మీ అభిమానిని’’ అని తెలిపారు. ‘ఆల్‌ ది బెస్ట్‌’ అని సీఎం ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయమంత్రి విజయ్‌ గోయల్‌ (బీజేపీ) కూడా చంద్రబాబును కలిసి పరిచయం చేసుకున్నారు. బీజేపీ ఎంపీలు సాక్షి మహారాజ్‌, పరేశ్‌ రావల్‌, హేమమాలిని కూడా చంద్రబాబును కలిశారు.

cbn 04042018 3

పార్లమెంటు సెంట్రల్‌ హాలులో చంద్రబాబుతో ఎన్సీపీ నేత శరద్‌ పవార్‌ కొంత ప్రత్యేకంగా చర్చించారు. ఏపీకి మోదీ చేసిన అన్యాయంతోపాటు వైసీపీ-బీజేపీ మధ్య సంబంధాలు, భవిష్యత్‌ కార్యాచరణ గురించి కూడా వారు కొద్ది సేపు చర్చలు జరిపారు. తాను మళ్లీ వస్తానని, ఈ పర్యటనలో ఏపీకి మోదీ సర్కారు చేసిన అన్యాయం గురించి మరింత వివరంగా చెబుతానని చంద్రబాబు తెలిపారు. ఇక... సమాజ్‌వాదీ నేత అమర్‌సింగ్‌ ఏపీ భవన్‌కు వెళ్లి ఆయనతో కీలక చర్చలు జరిపారు.

Advertisements