రాజధాని నిర్మాణం కోసం సీఆర్‌డీఏ జారీ చేసిన అమరావతి బాండ్లను బాంబే స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ (బీఎస్‌ఈ)లో సోమవారం నమోదు చేశారు. లిస్టింగ్‌ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు. జ్యోతి ప్రజ్వలన అనంతరం 9.15 గంటలకు చంద్రబాబు గంట కొట్టి నమోదును లాంఛనంగా ప్రారంభించారు. రాజధాని నిర్మాణానికి అవసరమైన నిధుల సమీకరణకు సీఆర్‌డీఏ ఇటీవల ఎలక్ట్రానిక్‌ ప్లాట్‌ఫామ్‌పై బాండ్లను జారీ చేయగా కేవలం గంట వ్యవధిలోనే మదుపరుల నుంచి రూ.2 వేల కోట్లు సమకూరిన సంగతి తెలిసిందే. అవే బీఎస్‌ఈలో సోమవారం లిస్టింగ్‌ అయ్యాయి.

bse 27082018 2

ఈ కార్యక్రమంలో బీఎస్‌ఈ సీఈవో, ఎండీ ఆశిష్‌కుమార్‌, ఏపీ మంత్రి నారాయణ, సీఆర్‌డీఏ కమిషనర్‌ చెరుకూరి శ్రీధర్‌ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనలో పెట్టుబడులు ఆకర్షించడంలో ఆంధ్రప్రదేశ్‌ అగ్రస్థానంలో ఉందని బీఎస్‌ఈ సీఈవో, ఎండీ ఆశిష్‌కుమార్‌ అన్నారు. సాంకేతిక వినియోగంలోనూ ప్రథమస్థానంలో కొనసాగుతోందని ప్రశంసించారు. అమరావతి నిర్మాణం అద్భుతంగా కొనసాగుతోందన్నారు. నగర నిర్మాణంలో మౌలిక సదుపాయాల కల్పన కోసం బాండ్లు జారీ చేయడం మంచి ఆలోచన అన్నారు. 1998లో అహ్మదాబాద్‌ నిర్మాణం కోసం మున్సిపల్‌ బాండ్లు జారీ అయ్యాయని తెలిపారు.

bse 27082018 3

అమరావతి బాండ్లు ఆగస్టు 14న జారీ కాగా.. గంట వ్యవధిలోనే రూ.2వేల కోట్లు ఆర్జించినట్లు వెల్లడించారు. బీఎస్‌ఈలో 500 కంపెనీలు నమోదయ్యాయని.. 6 మెక్రో సెకన్లలో లావాదేవీలు నిర్వహించుకునేలా బీఎస్‌ఈ ఎదిగిందని ఆశిష్‌కుమార్‌ తెలిపారు. ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన... స్టాక్‌ఎక్స్ఛేంజ్‌గా బీఎస్‌ఈ కొనసాగుతోందని ఆశిష్‌కుమార్‌ వ్యాఖ్యానించారు. 260కి పైగా చిన్న, మధ్యతరహా పరిశ్రమలు కూడా లిస్టింగ్ అయి ఉన్నాయి అని చెప్పారు.

Advertisements