రాఫెల్ యుద్ధ విమానాల కుంభకోణం నిజమే అని మరో వార్తా సంస్థ పరిశోధనలో తేలిపోయింది. ఈ కధనంతో రాఫెల్‌ డీల్‌లోని చీకటి కోణాలు వెలుగులోకి వచ్చాయి. ధర విషయంలో దోపిడీ జరిగిందని స్పష్టంగా తేలిపోయింది. అంతా ఇంతా కాదు, ఏకంగా 40 శాతం మొత్తానికి టెండరు పెట్టినట్లు స్పష్టమైంది. ప్రభుత్వరంగ సంస్థ అయిన ‘హాల్‌’ను పక్కనపెట్టి అనిల్‌ అంబానీకి మేలు చేసిన వైనం కూడా బయటపడింది. పాత, కొత్త ఒప్పందాలపై సేకరించిన కీలక పత్రాల ఆధారంగా ‘బిజినెస్‌ స్టాండర్డ్‌’ ఈ సంచలన కథనం ప్రచురించింది. 2012 ఒప్పందం ప్రకారం, దసో సంస్థ ఒక్కో రాఫెల్‌ విమానాన్ని 15.5 కోట్ల యూరోల (రూ. 1000 కోట్లు)కు అందించేందుకు ముందుకు వచ్చింది.

businessstandarad 13112018 2

18 రాఫెల్‌ విమానాలను ఫ్రాన్స్‌లోనే తయారు చేసి ‘రెడీ టు ఫ్లై’ దశలో భారత్‌కు అప్పగిస్తారు. మరో 108 విమానాలను బెంగళూరులోని ‘హాల్‌’లో తయారు చేసేందుకు వీలుగా దసో, థేల్స్‌, స్నెకా సంస్థలు పరికరాలను, పరిజ్ఞానాన్ని అందిస్తాయి. అదే విమానం! అవే నిబంధనలు! అయితే.. ఒకేసారి 36 కొనేయాలని మోదీ సర్కారు నిర్ణయించింది. వీటికి 7800 కోట్ల యూరోలు చెల్లించేలా 2016లో ఒప్పందం కుదుర్చుకుంది. అంటే... సగటున ఒక్కో విమానం విలువ 21.7 కోట్ల (రూ. 1600 కోట్లు) యూరోలు. నాలుగేళ్లలో ఒక్క విమానం విలువ రూ.600 కోట్లు పెరిగిపోయింది. అంటే.. రాఫెల్‌కు మోదీ సర్కారు 40 శాతం అదనపు ధర చెల్లిస్తోంది. ఇది... ‘‘నిజానికి మా డీల్‌లో 9 నుంచి 20 శాతం ధర తగ్గుతోంది. పాత ఒప్పందంలో ఆయుధాలు, స్పేర్‌ పార్టులు, నిర్వహణ గ్యారెంటీ వంటివి లేవు’’ అని రక్షణ మంత్రి నిర్మలా, ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ ప్రకటించారు.

businessstandarad 13112018 3

కానీ... వీరు చెప్పింది పచ్చి అబద్ధాలని ‘బిజినెస్‌ స్టాండర్డ్‌’ తేల్చింది. ధరలో మార్పు మాత్రమే కాదు... రాఫెల్‌ డీల్‌లో మరో కీలకమైన పరిణామం చోటు చేసుకుంది. అది.. హాల్‌ స్థానంలో అనిల్‌ అంబానీకి చెందిన ‘రిలయన్స్‌ డిఫెన్స్‌ లిమిటెడ్‌’ రంగ ప్రవేశం. ప్రధాని మోదీ ఫ్రాన్స్‌లో రాఫెల్‌ డీల్‌పై ప్రకటన చేయడానికి కేవలం 10 రోజుల ముందే ఈ సంస్థ పుట్టింది. కాగా.. రాఫెల్‌ కొనుగోలుకు సంబంధించిన వివరాలను కేంద్ర ప్రభుత్వం సీల్డ్‌ కవర్‌లో సుప్రీం కోర్టుకు సమర్పించింది. మరో 16 పేజీల్లో ఇతర వివరాలను అందించారు.

Advertisements