కేబుల్‌ చార్జీల విధానంపై టెలికాం నింయత్రణ సంస్థ (ట్రాయ్‌) నిబంధనలు విధించింది. ఈ మేరకు కేబుల్‌ ఆపరేటర్లు కాస్త చార్జీలు సవరిస్తూ తుది నిర్ణయం ప్రకటించారు. కొత్త విధానంలో వీక్షకులు ఎంపిక చేసుకునే ప్యాకేజీల ఆధారంగా పడే చార్జీలు భార మా.. కాదా అనేది బిన్నాభిప్రాయమే. సుమారు రూ.70 వరకు కొత్త ప్యాకేజీలు చార్జీలు పెరుగుతున్నాయి. గత ఏడాది డిసెంబర్‌ 29 నుంచి అమలు చేయాల్సిన నూతన విధానాన్ని గత నెలాఖరుకు వాయిదా వేసిన సంగతి తెలిసిందే. కొత్త విధానం ప్రకారం కేబుల్‌ ఛార్జీలు పెరుగుతాయి. ఇప్పటికే ఆయా ఛానల్స్‌ తమ ప్రసారాలలో ప్యాకేజీల టారిఫ్‌ ప్రకటిస్తున్న సంగతి తెల్సిందే.

teluguchannels 02022019

ప్రస్తుతం 400 ఛానల్స్‌ వరకు ఒకే రకమైన ప్యాకేజీలో ఆయా ప్రాంతాలననుసరించి రూ.200 నుంచి 300 రూపాయిల వరకు నెలవారీ బిల్లు చెల్లిస్తున్నారు. కొత్త విధానంలో ఛానల్స్‌ తమ గ్రూప్‌ ద్వారా ప్రసారమయ్యే ఛానల్స్‌ను ఒకే గుత్తగా (బొకేగా పిలుస్తారు) ఎంపిక చేసి దానికి ధర నిర్ణయించారు. రెండు వేర్వేరు చానల్స్‌ హెచ్‌డీ ప్రసారాల ప్యాక్‌లు కూడా ఉన్నాయి. తెలుగు చానళ్ల ధరలు ఇలా.. ఈటీవీ ఫ్యామిలీ ప్యాక్‌ (7 తెలుగు చానళ్లు) రూ.24, జెమినీ (7 తెలుగు చానళ్లు) రూ.30, స్టార్‌ మా (7తెలుగు, 3 ఇతర భాషా చానళ్లు) రూ.39, జీ తెలుగు (2 తెలుగు, 7 ఇతర భాషా చానళ్లు) రూ.20, మొత్తం రూ.113+రూ.20.34 జీఎస్టీ ఉంది. ఇక ఫ్రీ టూ ఎయిర్‌ ఛానల్స్‌ అంటే ఉచితంగా లభించే తెలుగు, ఆంగ్ల న్యూస్‌ ఛానల్స్‌, డీడీ, ఇతర ఉచిత ఛానల్స్‌ ఉన్నాయి. ఇవన్నీ తప్పనిసరిగా తీసుకోవాల్సిన ప్రీమియం ప్యాకేజీ రూ.130లో లభిస్తాయి.

teluguchannels 02022019

దీనికి 18శాతం జీఎస్టీ ఉంటుంది. రూ.130 బేసిక్‌ ప్యాకేజీ ట్యాక్స్‌తో కలిపి రూ.155 అవుతుంది. ఇతర ఛానల్స్‌, బొకేలు కావలసినవి ఎంపిక చేసుకోవచ్చు. అలాకార్ట్‌ (రెండు వేర్వేరు చానల్స్‌ ఒకే ప్యాక్‌) విధానంలో మాటీవీ హెచ్‌డి ఒక్కటే 19 రూపాయలు. సాధారణమైతే ఎస్‌డి 10 చానల్స్‌ బొకే రూ.39 ధరకు లభిస్తాయి. మొత్తం మీద పేఛానల్స్‌, ప్రీమియం ఛానల్స్‌ కలిపి రూ.285-300 వరకు నెలవారీ చార్జీలు చెల్లించాల్సి వస్తుంది. డిజిటల్‌ వ్యవస్థతో కేబుల్‌ ప్రసారాలు సాగుతున్నాయి. అత్యంత నాణ్యతతో కూడిన ప్రసారాలను ప్రేక్షకులు వీక్షించే అవకాశం దక్కింది. ప్రస్తుతం 400 ఛానల్స్‌ వరకు ప్రేక్షకులకు అందుతున్నాయి. ప్యాకేజీ మారితే ఇక సాధారణ ప్రేక్షకులు తక్కువ ఛానల్స్‌ ఎంపిక చేసుకుంటే 18శాతం జీఎస్టీతో కలిపి ప్రస్తుతం చెల్లిస్తున్న బిల్లు కొనసాగే అవకాశముంది. ఎక్కువ ఛానల్స్‌ తీసుకుంటే ఆ ప్రకారం నెలవారి బిల్లు పెరగక తప్పదంటున్నారు.

 

Advertisements