వైఎస్ వివేకా కేసులో, నేడు కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎప్పుడు ఏమి జరుగుతుందా అనే విషయం పై, రాష్ట్రం మొత్తం టెన్షన్ తో ఉంది. ఏ నిమిషాన ఏమి జరుగుతుందో, పెద్ద తలకాయలు అరెస్ట్ అయితే, ఎలాంటి గొడవలు జరుగుతాయో, అలాగే సాక్ష్యం ఇచ్చిన వారిని ఏమి చేస్తారో అనే టెన్షన్ నెలకొంది. ఇప్పటికే నిన్న ఢిల్లీ నుంచి సిబిఐ ఉన్నతాధికారుల బృందం రావటంతో, పెద్ద తలకయాలు అయిన అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి అరెస్ట్ తధ్యం అనే విషయం అర్ధం అవుతుంది. అయితే వీటి అన్నిటి పరిణామాల్లో, సాక్ష్యులను రక్షించుకోవటం, ఇప్పుడు సిబిఐకి మరో సవాల్ గా మారింది. పరిటాల రవి కేసులో కూడా, ఒక్క సాక్ష్యం కూడా లేకుండా అందరూ పోయారు. ఇప్పుడు ఈ కేసులో కూడా అలాగే జరిగే అనుమానాలు ఉన్నాయని అందరూ అనుకుంటున్న సమయంలో, సిబిఐ రంగంలోకి దిగింది. ముఖ్యంగా దస్తగిరి, వాచ్మెన్ రంగన్న భదత్ర సిబిఐకి ముఖ్యం. ఎందుకు అంటే, వీరి ఇద్దరూ అక్కడ ప్రత్యక్ష సాక్ష్యులు. దస్తగిరి అనే వ్యక్తి చంపిన నలుగురిలో ఒకడు. అతను ప్రస్తుతం అప్రూవర్ గా మారిపోయాడు. అతనికి కడప కోర్టు క్షమాభిక్షతో బెయిల్ ఇచ్చింది. ఇక మరొక అతను వాచ్ మేన్ రంగన్న. ఆ రోజు ఇంట్లో నుంచి పెద్ద పెద్ద శబ్దాలు వినిపించాయని చెప్పాడు.

cbi 04032022 2

ఆ సమయంలో నిద్ర లెగిసి చూడగా, నలుగురు వ్యక్తులు వివేకా గదిలో నుంచి బయటకు వచ్చారని, ఎర్ర గంగి రెడ్డి, ఇక్కడ జరిగింది చెప్తే చంపేస్తానని బెదిరించాడని చెప్పాడు. ఇప్పుడు వీరిద్దరూ కీలకం కావటంతో, సిబిఐ వీరి భద్రత పైన దృష్టి పెట్టింది. వీరు పులివెందులలోనే ఉంటున్నారు. వారికి కేవలం ఒక కానిస్టేబుల్ రక్షణ ఉంది. అయితే ఈ రోజు రేపట్లో, అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేస్తారు అనే సమాచారం ఉన్న నేపధ్యంలోనే, సిబిఐ వీరి భద్రత కోసం, కోర్టులో పిటీషన్ దాఖలు చేసింది. కోర్టు ద్వారానే వీరికి భద్రత ఇప్పించాలని సిబిఐ నిర్ణయం తీసుకుంది. నిన్న దస్తగిరి, రంగన్నను పిలిపించిన సిబిఐ, వారి నుంచి సంతకాలు తీసుకుంది. ఈ రోజు కోర్టులో పిటీషన్ దాఖలు చేసే అవకాసం ఉంది. కోర్టు ద్వారానే వీరికి భద్రత కల్పించాలని, ప్రభుత్వ పెద్దలే ఇందులో భాగస్వాములుగా ఉండటంతో, సిబిఐ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ రోజు అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డిలకు నోటీసులు ఇవ్వటం, తరువాత అరెస్ట్ చేయటం జరిగే అవకాసం ఉందని, వార్తలు వినిపిస్తున్నాయి.

Advertisements