ఎలక్షన్ కమిషన్ నియమించిన ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ ఎల్వీ సుబ్రమణ్యం పై, జగన్ కేసుల్లో సీబీఐ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఏపి ప్రతిపక్ష నాయకుడు వైఎస్‌ జగన్‌ అక్రమాస్తులకు సంబంధించిన ఎమ్మార్‌ ప్రాపర్టీస్‌ కేసు నుంచి ఎల్వీ సుబ్రమణ్యంని తప్పిస్తూ ఏపి ఉమ్మడి హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను నిలిపి వేయాలని కోరింది. జగన్ పన్నిన ఈ కుట్రలో ఎల్వీ సుబ్రమణ్యం కూడా భాగస్వామి అని నిరూపించేందుకు స్పష్టమైన డాక్యుమెంట్లు, ఇతర ఆధారాలు తమ వద్ద ఉన్నాయాని తెలిపింది. జగన్ కు లబ్ది చేకూరుస్తూ, ఎల్వీ తీసుకున్న చర్యలతో ఏపీఐఐసీ పై తీవ్ర ఆర్థికభారం పడిందని సీబీఐ పేర్కొంది. అవినీతి నిరోధక చట్టం-1998 కింద ఆయనను విచారించేందుకు కేంద్రం నుంచి అనుమతి తీసుకున్నామని, ఎమ్మార్‌ కుట్రలో ఆయన పాత్రను నిరూపించే స్పష్టమైన ఆధారాలను కోర్టులో సమర్పించిన తర్వాత హైకోర్టులో క్వాష్‌ పిటిషన్‌ దాఖలు చేశారని వివరించింది. ఈ కేసు నుంచి ఎల్వీని తప్పించడం న్యాయ విరుద్ధమని సీబీఐ తెలిపింది. ఈ కేసు సుప్రీం కోర్ట్ లో, మే 10న విచారణకు రానున్నట్టు సమాచారం..

lvs 270472019

ఇదీ కేసు...ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్‌ ఉన్నప్పుడు... 2003 సెప్టెంబరు నుంచి 2005 మే దాకా ఎల్వీ సుబ్రమణ్యం పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పనా సంస్థ (ఏపీఐఐసీ) వైస్‌ చైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌గా పనిచేశారు. ఆ సమయంలో హైదరాబాద్‌ కేంద్రంగా ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యంతో భారీ ప్రాజెక్టును చేపట్టారు. ఎమ్మార్‌ ప్రాపర్టీస్‌ కంపెనీతోపాటు మరి కొన్ని సంస్థలతో కలిసి ఏపీఐఐసీ దీన్ని చేపట్టేలా విధివిధానాలు రూపొందించారు. ఇదో భారీ హౌసింగ్‌ ప్రాజెక్టు. ప్లాట్లు, విల్లాలు, గోల్ఫ్‌కోర్సు, కన్వెన్షన్‌ సెంటర్ల నిర్మాణం వంటివి ఎన్నో ఇందులో భాగం. దీనికోసం స్పెషల్‌ పర్పస్‌ వెహికల్‌ (ఎస్‌పీవీ) ఏర్పాటు చేశారు. ఈ ప్రాజెక్టు అవసరమైన ప్రైవేటు భూమి సేకరణ ధర ఖరారు నుంచి ఒప్పందాలు, లీజు ఫీజుల నిర్ణయం, వాటాల ఖరారు, ఇతర నిబంధనల అమల్లో అనేక అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై సీబీఐ విచారణ జరిపింది.

lvs 270472019

ఇంటిగ్రేటెడ్‌ ప్రాజెక్టులో ఏపీఐఐసీని దగా చేశారని... ప్రైవేటు భాగస్వాములకు కోట్లరూపాయలు లాభం వచ్చేలా వ్యవహరించారని, ఇదంతా రహస్య నేరపూరిత కుట్ర మేరకు జరిగిందని సీబీఐ నిర్ధారించింది. 2011 ఆగస్టు 10న సీబీఐ కేసు నమోదు చేసిది.. ఇందులో ఎల్వీని 11వ నిందితుడిగా (ఏ-11) చేర్చింది. 2011 ఫిబ్రవరి ఒకటి నుంచి వరసగా చార్జిషీట్లు నమోదు చేసింది. అవినీతి నిరోధక చట్టం-1988 కింద ఎల్వీని విచారించేందుకు కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకుంది. అయితే, ఎల్వీ 2017లో హైకోర్టును ఆశ్రయించారు. తనపై సీఐబీ నమోదు చేసిన కేసునుంచి విముక్తి కల్పించాలని క్వాష్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను విచారించిన హైకోర్టు గత ఏడాది జనవరి 4న ఎల్వీకి ఈ కేసు నుంచి విముక్తి కల్పిస్తూ ఆదేశాలు జారీ చేసింది.

 

Advertisements