ఆయన ప్రపంచ పఠంలో పెట్టిన ప్రాంతం అది. ఏకంగా సైబెరాబాద్ అనే ఒక సిటీని సృష్టించి, హైదరాబాద్ కే కాదు, ఏకంగా తెలంగాణా రాష్ట్రానికే గుండెకాయ చేసారు. కాని, అక్కడ వికృత రాజకీయ క్రీడలో, ఆయన పై ద్వేషం నింపేలా కుట్రలు చేసి, దాదాపుగా సఫలీకృతం అయ్యారు. ఇప్పుడు దాదాపు నాలుగున్నరేళ్ల తర్వాత మొదటి సారి, అక్కడ బహిరంగ సభలో పాల్గునటానికి చంద్రబాబు వెళ్తున్నారు. గత నెల రోజులుగా కేసీఆర్ చంద్రబాబుని తిడుతున్న బూతులు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, తెలంగాణా ప్రజలకు ఏం సందేశం ఇస్తారా అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తెలంగాణలో ప్రజాకూటమి విజయాన్ని కాంక్షిస్తూ ఈ నెల 28న ఖమ్మంలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు కొనసాగుతున్నాయి.

cbn 27112018 2

ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ, టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, సీపీఐ జాతీయ కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి, టీజేఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు ప్రో.కోదండరాంతోపాటు తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, తెలంగాణ టీడీపీ అధ్యక్షు డు ఎల్‌ రమణ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి తదితరులు ఈ సభకు హాజరవుతున్నారు. ఖమ్మం నగరంలోని ఎస్‌ఆర్‌అండ్‌బీజీఎన్‌ఆర్‌ కళాశాల మైదానంలో చురుగ్గా ఏర్పాట్లు సాగుతున్నాయి. మధ్యాహ్నం 2.30 గం టల సమయంలో రాహుల్‌గాంధీ, చంద్రబాబు నాయుడు వేర్వేరు హెలీకాప్టర్లలో రాబోతున్నారు. సర్ధార్‌ పటేల్‌ స్టేడియంలో ల్యాండింగ్‌కు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు.

cbn 27112018 3

జాతీయస్థాయిలో బీజేపీయేతర లౌకిక శక్తులు ఏకమవుతున్న నేపథ్యంలో రాహుల్‌, చంద్రబాబు నాయుడు కలిసి మొదటి బహిరంగసభలో పాల్గొనబోతు న్నారు. ఉమ్మడి ఖమ్మంతోపాటు పొరుగున ఉన్న వరంగల్‌, నల్గొండ ఉమ్మడి జిల్లాల ప్రజలను కూడా ఈ సభకు భారీగా తరలించేందుకు నేతలు ప్రయత్నిస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల తరువాత చంద్రబాబు నాయుడు తెలంగాణలో పార్టీ కోసం ప్రత్యేకంగా ఎక్కడా బహిరంగసభలు నిర్వహించలేదు. హైదరాబాద్‌లోనే పార్టీ సమావేశాలకు పరిమితమయ్యారు. జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా హైదరాబాద్‌లో ప్రచారం చేశారు. హైదరాబాద్ మినహా తెలంగాణలోని ఏ ఒక్క జిల్లాలోనూ చంద్రబాబు ప్రచారం చేయలేదు. ఖమ్మంలో మొదటిసారి చంద్రబాబు తెలంగాణ టీడీపీ కోసం బహిరంగసభలో పాల్గొనబోతున్నారు. జాతీయ, రాష్ట్ర రాజకీయాల ప్రస్తావనతోపాటు తెలంగాణలో ప్రజాకూటమి పాత్ర గురిచి వివరించే అవకాశం ఉంది. ఎన్నికల ప్రచారంలో కేసీఆర్‌ చంద్రబాబును టార్గెట్‌ చేస్తున్న నేపథ్యంలో.. చంద్రబాబు ప్రచారానికి వస్తుండడం ఆసక్తికరంగా మారింది.

Advertisements