సీఎం చంద్రబాబు నివాసంలో తెదేపా సమన్వయ కమిటీ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా యూపీ, బిహార్‌లో లోక్‌సభ స్థానాల ఉప ఎన్నిక ఫలితాలతో పాటు వైకాపా వ్యవహార శైలి, విభజన హామీలు నెరవేర్చడంలో కేంద్రం వ్యవహరిస్తున్న తీరు, తదితర అంశాలపై చర్చిస్తున్నారు.. యూపీ, బిహార్‌ లోక్‌సభ ఉప ఎన్నికల ఫలితాలను సీఎం నేతలను అడిగి తెలుసుకున్నట్టుగా సమాచారం. వివిధ రౌండ్లలో ఆయా పార్టీలకు వస్తోన్న ఓట్ల సరళిని అడిగి తెలుసుకున్న ముఖ్యమంత్రి, దేశంలో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయని నేతలతో అన్నారు...

cbn review 14032018 2

మరో పక్క తెలుగుదేశం నేతలు కూడా, బీజేపీ ఓటిమి పై, వారు ఆంధ్రప్రదేశ్ కు చేసిన అన్యాయం గుర్తు చేసుకుని, విమర్శలు చేస్తున్నారు... విభజన హామీలు నెరవేర్చకుండా ప్రజల మనోభావాలను కించపరిచేలా వ్యవహరిస్తున్న భాజపాకు ఉత్తర్‌ప్రదేశ్‌లో దెబ్బ తగిలిందని వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు అన్నారు. గోరఖ్‌పూర్‌లో అత్యధికంగా ఉన్న తెలుగు వారు భాజపాకు గుణపాఠం చెప్పారన్నారు. శ్రీకాకుళం, విజయనగరం నుంచి ఎక్కువగా గోరఖ్‌పూర్‌కు వలస వెళ్లారని ఆయన తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ను భాజపా మోసం చేసిన ప్రభావం అక్కడ పడిందన్నారు.

cbn review 14032018 3

మరో ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ మాట్లాడుతూ.. ప్రధాని ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్‌ చేశారు. మోసం ఒక రాష్ట్రానికి చేసినా, ఒక వ్యక్తికి చేసినా మోసమేనన్నారు. ఆంధ్రప్రదేశ్‌తో మాకు పనిలేదు యూపీ ఉందని భాజపా భ్రమపడిందని, ఇవాళ సొంత నియోజకవర్గంలోనే ఓడిపోయే పరిస్థితి నెలకొందన్నారు. తెలుగు వారికి జరిగిన అన్యాయం పక్క రాష్ట్రాల వారికి అర్థమైందని, అందుకే భాజపా ఓడిపోయిందన్నారు. భాజపాకు ఈ ఓటమి ఒక గుణపాఠంగా ఉండాలని తెలిపారు. ఈ ఫలితాల తర్వాత అయినా భాజపాలో మార్పు రావాలని, హోదా అమలు చేయాలని ఆయన కోరారు.

Advertisements