తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్‌లో మమతాబెనర్జీ ఉన్నారంటూ కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ ఎలా ప్రకటిస్తారు? అని సీఎం చంద్రబాబు ప్రశ్నించారు. ఫెడరల్ ఫ్రంట్ ఎక్కడుంది?..దాన్ని ప్రమోట్‌ చేస్తోంది మోదీ, జైట్లీనేనని ఆయన చెప్పారు. మహాకూటమి విఫలం కాలేదని, విఫలమైంది ప్రధాని మోదీ, ఆర్థికమంత్రి జైట్లీనేనని చంద్రబాబు కౌంటర్ ఇచ్చారు. బీజేపీయేతర కూటమి పేరుతో సీఎం చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలు తెలిసిందే. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. బీజేపీ, కాంగ్రెస్ యేతర ఫెడరల్ ఫ్రంట్ ప్రయత్నాలు కూడా తెలిసిందే. ఈ మధ్యనే సీఎం కేసీఆర్.. పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీతో భేటీ అయి ఫెడరల్ ఫ్రంట్‌పై చర్చించారు. అయితే దీదీ మాత్రం ఈ విషయం పై అసలు మీడియాతో కూడా మాట్లాడలేడు.

jaitley 02012019

ఇప్పటికే మమతాబెనర్జీ మహాకూటమిలో ఉన్నారు. ఈ నేపథ్యంలో స్పందించిన కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ.. మహాకూటమి, ఫ్రెడరల్ ఫ్రంట్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మహాకూటమి అనేది భారత్‌ను భయపెట్టే ఆలోచనని, తెలంగాణలో మహాకూటమి విఫలమైందని, లోక్‌సభ ఎన్నికల్లోనూ మహాకూటమికి ఓటమి తప్పదని జైట్లీ ఎద్దేవా చేశారు. ఫెడరల్‌ ఫ్రంట్‌ మోదీ గూటి చిలకేనని స్పష్టం చేశారు. ‘ప్రతిపక్షాలు రెండు కూటములుగా చీలిపోయాయని, ఫెడరల్‌ ఫ్రంట్‌లో బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ చేరారని బీజేపీ నేతలు చెబుతున్నారు. ఆ ఫ్రంట్‌లో చేరామని మమత, నవీన్‌ పట్నాయక్‌ ఎక్కడైనా చెప్పారా? వాళ్లు చెప్పకుండానే ఫెడరల్‌ ఫ్రంట్‌కు వీళ్లెందుకు ప్రచారం చేస్తున్నారు?"

jaitley 02012019

"దీనినిబట్టే ఆ ఫ్రంట్‌ ఎవరిదో తెలిసిపోతోంది. ఉనికిలోనే లేని ఫ్రంట్‌కు ప్రచారం కల్పించాలని మోదీ, జైట్లీ తాపత్రయపడుతున్నారు. ప్రతిపక్షాలు చీలిపోయాయని ప్రజలను నమ్మించగలిగితే తమకు లాభం వస్తుందని లెక్కలు వేసుకుని ఆ ఫ్రంట్‌ను ప్రోత్సహిస్తున్నారు. ఉన్నవి రెండే కూటములు. ఒకటి బీజేపీ అనుకూల కూటమి.. రెండోది బీజేపీ వ్యతిరేక కూటమి. మమత బీజేపీకి వ్యతిరేకంగానే ఉన్నారు’ అని తేల్చిచెప్పారు. తెలంగాణలో టీఆర్‌ఎస్‌ గెలిస్తే బీజేపీ నేతలకు ఆనందం ఎందుకని చంద్రబాబు ప్రశ్నించారు. ‘ప్రధాని రెండుసార్లు, బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షా ఏడు సార్లు తెలంగాణలో పర్యటించారు. వారితోపాటు 17 మంది కేంద్ర మంత్రులు, ఏడుగురు ముఖ్యమంత్రులు కూడా ప్రచారం చేస్తే బీజేపీకి కేవలం ఒకటే సీటు వచ్చింది. ప్రధానిని సన్నాసి, ఫాసిస్ట్‌, గాడు అని కేసీఆర్‌ విమర్శించినా బీజేపీ నేతలు మాట్లాడడం లేదు. దీనినిబట్టే వారి మధ్య లాలూచీ తెలిసిపోతోంది. ప్రజలను అన్నిసార్లూ మోసం చేయలేరు’ అని తేల్చిచెప్పారు.

Advertisements