సీఎం చంద్రబాబు దీక్షకు పలు జాతీయ పార్టీల మద్దతు ప్రకటిస్తున్నాయి. చంద్రబాబు దీక్షకు 22 పార్టీల నేతలు మద్దతివ్వనున్నారు. నేషనల్‌ కాంగ్రెస్‌ అధినేత ఫరూక్‌అబ్దుల్లా, ఎన్సీపీ అధినేత శరద్‌పవార్, శరద్‌యాదవ్‌, తృణమూల్‌ కాంగ్రెస్‌, డీఎంకే నేతల మద్దతిస్తున్నారు. మాజీ ప్రధాని దేవెగౌడ, కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ లేదా ఆయన ప్రతినిధులు దీక్షకు సంఘీభావం తెలుపుతామని చంద్రబాబుకు సమాచారమిచ్చినట్లు తెలుస్తోంది. ఈ నెల 11న ఢిల్లీలో ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకు చంద్రబాబు దీక్ష చేపట్టనున్నారు. ఏపీ భవన్‌లో చంద్రబాబు దీక్ష చేస్తారు. ఏపీకి జరిగిన అన్యాయంపై పార్లమెంట్‌లోనూ నినదించాలని ఇప్పటికే ఆయన నిర్ణయం తీసుకున్నారు.

delhi 09022019 1

ఢిల్లీ వేదికగా ఈనెల 11న నిర్వహించే ధర్మపోరాటాన్ని విజయవంతం చేయాలని చంద్రబాబు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ప్రజలు, ప్రజా సంఘాలంతా రాష్ట్రం వైపు ఉంటే, ప్రతిపక్షాలు మాత్రం రాజకీయాల వైపు ఉన్నాయని ఆయన విమర్శించారు. దీనిని ప్రజలంతా గమనిస్తున్నారని, ఎవరు రాష్ట్రం కోసమో, ఎవరు రాజకీయాల కోసమో ఢిల్లీలో జరిగే ఆందోళనే తేలుస్తుందన్నారు. ఈ కార్యక్రమానికి ప్రతిపక్షాలను కూడా ఆహ్వానించామని, ఒకవేళ వాళ్లు రాకపోతే ఏం చేయాలో ప్రజలే నిర్ణయిస్తారని హెచ్చరించారు. దీక్షను విజయవంత చేయడానికి ప్రజాప్రతినిధులు, టీడీపీ నాయకులు, ఇన్‌‌చార్జులతో ఆయన టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు.

 

delhi 09022019 1

టీడీపీ అఖండ విజయమే ఏపీ భవిష్యత్‌ అని, అన్ని వర్గాల మద్దతు పొందాలని సూచించారు. ప్రత్యేక హోదా కోసం ఢిల్లీలో జరగనున్న ధర్మపోరాట దీక్షలో పాల్గొనేందుకు శుక్రవారం రాత్రి విశాఖ నుంచి టీడీపీ నాయకులు, కార్యకర్తలు బయలుదేరి వెళ్లారు. ఢిల్లీ వెళ్లే వారికోసం శ్రీకాకుళం నుంచి 17బోగీలతో వేసిన ప్రత్యేక రైల్లో 2బోగీలు విశాఖ నాయకులకు కేటాయించారు. ఏపి భ‌వ‌న్ ప్రాంగ‌ణంలో సీయం ఈ నెల 11న ఉద‌యం 8 గంట‌ల నుండి రాత్రి 8గంట‌ల వ‌ర‌కు దీక్ష చేయాల‌ని నిర్ణియంచారు. ఇందు కోసం ఏపి నుం డి రెండు ప్ర‌త్యేక రైళ్లు ఏర్పాటు చేసారు. ఈ నెల 12 రాష్ట్రప‌తిని క‌లిసి విన‌తి ప‌త్రం స‌మ‌ర్పిస్తారు.

Advertisements