టీడీపీ అధ్యక్షుడు, సీఎం చంద్రబాబు ఈ నెల 21న మహారాష్ట్రలోని ధర్మాబాద్‌ న్యాయస్థానానికి హాజరయ్యే అవకాశం కనిపించడం లేదు. 2010లో బాబ్లీ ప్రాజెక్టుపై చేసి న పోరాటంలో నమోదైన కేసులో ఆయన్ను, మరో 15 మందిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచాలని ధర్మాబాద్‌ మేజిస్ట్రేట్‌ అరెస్టు వారెంటు జారీ చేశారు. దీనిపై సీఎం బుధవారమిక్కడ సమీక్ష జరిపారు. రాష్ట్ర అడ్వొకేట్‌ జనరల్‌ దమ్మాలపాటి శ్రీనివాస్‌ కూడా హాజరయ్యారు. ముఖ్యమంత్రిపై అరెస్టు వారెంటు జారీ అయినట్లుగా మహారాష్ట్రలోని నాందేడ్‌ జిల్లా ఎస్పీ మన డీజీపీకి లేఖ పంపినట్లు అధికారులు తెలిపారు. ఆ లేఖతోపాటు అరెస్టు వారెంటును కూడా జతపరచాల్సి ఉందని.. కానీ పంపలేదని, దీంతో వారెంటు అందలేదని వివరిస్తూ న్యాయవాది ద్వారా ఈ నెల 21న ధర్మాబాద్‌ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేయాలని నిర్ణయించారు.

cvbn 20092018 2

బాబ్లీ కేసు వ్యవహారంపై మంత్రులు, అధికారులతో రెండు రోజులుగా చంద్రబాబు చర్చించారు. వారెంట్‌పై ఎలా ముందుకెళదామని నేతల వద్ద ప్రస్తావించారు. న్యాయ వ్యవస్థను గౌరవించి.. కోర్టుకు వెళ్దామని బాబు అంటే.. ప్రత్యామ్నాయ మార్గాలను పరిశీలించిన తర్వాత ఓ నిర్ణయం తీసుకుంటే మంచిదని కొందరు నేతలు అభిప్రాయపడ్డారట. రీ కాల్ పిటిషన్ వేస్తే కోర్టుకు వెళ్లే పని ఉండకపోవచ్చని.. ఆ దిశగా కూడా ఆలోచన చేయాలన్నారట. మరో పక్క, ఒక వేళ ఏమన్నా కుట్ర దాగి ఉన్నా, లేని పోని ఇబ్బందులు లేకుండా, రీకాల్ పిటిషన్‌ వైపే చంద్రబాబు మొగ్గు చూపారు. మరో పక్క 21 శుక్రవారం కావటం, ఎమన్నా ఇబ్బందులు వచ్చినా కోర్ట్ లో శనివారం, ఆదివారం కుదరదు, మరో పక్క చంద్రబాబు 22న అమెరికా వెళ్ళాలి, ఈ పరిస్థితులు అన్నీ బేరీజు వేసుకుని, రేపు లాయర్ ని పంపించాలని, రేపు కోర్ట్ ఆదేశాలను బట్టి, తరువాత వాయిదాకు ఏమి చెయ్యాలి అనే దాని పై నిర్ణయం తీసుకుందామని చంద్రబాబు నిర్ణయించారు.

cvbn 20092018 3

మరో పక్క చంద్రబాబు నేతృత్వంలో అధికారిక బృందం ఈ నెల 22 నుంచి 28 వరకు అమెరికాలో పర్యటించనుంది. ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు, ముఖ్యమంత్రి కార్యాలయ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీష్‌చంద్ర, ముఖ్య కార్యదర్శి శాయిప్రసాద్‌, మరో ఆరుగురు అధికారులు ఈ బృందంలో ఉన్నారు. వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం, బ్లూంబర్గ్‌ గ్లోబల్‌ బిజినెస్‌ ఫోరం సంయుక్తంగా నిర్వహించనున్న ‘సుస్థిర అభివృద్ధి-ప్రభావ సదస్సు’లో ముఖ్యమంత్రి పాల్గొననున్నారు. ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో ఈ సదస్సు జరగనుంది. అమెరికా పర్యటన ఉన్న నేపథ్యంలోనే ఎన్నారై తెలుగుదేశం ఆధ్వర్యంలో నిర్వహించే బహిరంగ సభను న్యూజెర్సీలో నిర్వహించనున్నారు. నెవార్క్‌ నగరంలోని న్యూజెర్సీ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ వెల్‌నెస్‌ కేంద్రంలో ఈ నెల 23న సభ జరగనుంది.

Advertisements