టీడీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం చంద్రబాబు విదేశీ పర్యటన వాయిదా పడింది. ఈ నెల 7 నుంచి 13 వరకూ కుటుంబ సభ్యులతో కలిసి విదేశాలకు వెళ్లాలని బాబు భావించారు. జూన్ 12 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అవుతాయని స్పీకర్ కార్యాలయం నుంచి ఉత్తర్వులు రాగానే, ఆయన తన పర్యటనను వాయిదా వేసుకున్నారు. విదేశీ పర్యటన ముగించుకొని వచ్చిన తర్వాత పార్టీ నేతలత వరసగా భేటీలు చేపట్టాలని బాబు భావించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా గత ఐదేళ్లు పగులు రాత్రి తేడా లేకుండా పని చేసిన చంద్రబాబు.. ఎన్నికల ప్రచారం సమయంలో తీవ్రంగా శ్రమించారు. ప్రచారం ముగిసిన తర్వాత కూడా జాతీయ స్థాయిలో విపక్షాలను ఏకం చేయడం కోసం వివిధ పార్టీల అధినేతలను కలిశారు. 50 శాతం వీవీప్యాట్‌లను లెక్కించాలంటూ ఇతర పార్టీలతో కలిసి సుప్రీంను ఆశ్రయించారు.

foreign tour 07062019

తరువాత ఎన్నికల ఫలితాలు చూసి చంద్రబాబు తీవ్ర నిరాశ చెందారు. ఎంత కష్టపడి పని చేసినా, అభివృద్ధి, సంక్షేమం సమానంగా చేసినా, రాజధాని లేని రాష్ట్రానికి అమరావతి కడుతున్నా, 70 ఏళ్ళ పోలవరం కల సాకారం చేస్తున్నా, ఫ్యామిలీతో గడపకుండా ప్రజల కోసం అనుక్షణం కష్టపడినా, ప్రజలు తిరస్కరించటంతో చంద్రబాబు తీవ్ర నిరాశ చెందారు. దీంతో కొన్నాళ్ళు కుటుంబంతో గడిపి, సమర్ధవంతంగా తిరిగి ప్రతిపక్ష పాత్ర పోషించటానికి, బ్రేక్ కోసం, కుటుంబ సమేతంగా వారం రోజులపాటు చంద్రబాబు విదేశాల్లో గడపుదామని అనుకున్నారు. ఈనెల 7 నుంచి చంద్రబాబు విదేశీ పర్యటన ప్రారంభమవుతుందని ముందుగా అనుకున్నారు. ఈ నెల 14న చంద్రబాబు మళ్లీ విజయవాడకు తిరిగి వస్తారని చెప్పారు. చంద్రబాబు విదేశీ పర్యటన ముగించుకుని వచ్చిన తరవాత పార్టీ బలోపేతం కోసం నేతలతో వరుస సమావేశాలు నిర్వహిస్తారని షడ్యుల్ ప్రకటించారు.

foreign tour 07062019

అయితే అనూహ్యంగా ప్రభుత్వం 12 నుంచే ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించనుంది. ఈ మేరకు ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్‌ ఇఎస్‌ఎల్‌ నరసింహన్‌ గురువారం నోటిఫికేషన్‌ జారీ చేశారు. 13న కొత్తగా ఎన్నికైన సభ్యులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అదే రోజు స్పీకర్‌ను, డిప్యూటీ స్పీకర్‌లను ఎన్నుకోనున్నారు.14న ఉభయ సభల సంయుక్త సమావేశం జరగనుంది. ఆ సమావేశంలో గవర్నర్‌ ప్రసంగించనున్నారు. 14 నుంచి శాసన మండలి సమావేశాలు జరుగుతాయి. ఈ నేపధ్యంలోనే చంద్రబాబు తన విదేశీ పర్యటన వాయిదా వేసుకున్నారని తెలుస్తుంది.

Advertisements