ఏపీ అభివృద్ధిలో దూసుకెళ్తుంటే అసూయ పడుతున్నారు సీఎం చంద్రబాబు అన్నారు. ఏమీ లేకపోయినా కోడి కత్తి కేసును కేంద్రం ఎన్‌ఐఏకి అప్పగించిందని మండిపడ్డారు. కోడి కత్తి కేసులో బెయిల్‌ కూడా రాకుండా కేసులు నమోదు చేశామన్నారు. జగన్‌ ఫిర్యాదు చేయకపోయినా సీరియస్‌గా దర్యాప్తు చేశామని చెప్పారు. రాష్ట్ర అధికారాలపై కేంద్రం జోక్యం చేసుకుంటే ఊరుకునేది లేదని సీఎం హెచ్చరించారు. దేశ వ్యవస్థలపై జగన్‌కు నమ్మకం లేకుంటే ఏ దేశంతో విచారణ కోరతారని ప్రశ్నించారు. అభివృద్ధిపై ఎవరితోనైనా చర్చకు సిద్ధమని చంద్రబాబు సవాల్ విసిరారు.

cbn 180120019

మరో పక్క, కోడికత్తి కేసును ఎన్‌ఐఏకు అప్పగించాలన్న కేంద్రం నిర్ణయంపై న్యాయపోరాటం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రాల హక్కుల్లో తలదూర్చే విధంగా.. సమాఖ్య వ్యవస్థకు తూట్లు పొడిచేలా కేంద్రం వ్యవహరిస్తోందని రాష్ట్ర ప్రభుత్వం విమర్శిస్తోంది. ‘ఎన్‌ఐఏకు ఉగ్రవాదం కేసులు, రెండు, మూడు రాష్ట్రాల్లో నేరాలతో సంబంధమున్న కేసులను మాత్రమే అప్పగిస్తారు. ఎన్‌ఐఏ ఏర్పాటు చట్టంలోనే ఆ విషయాన్ని స్పష్టంగా పేర్కొన్నారు. అలాంటిప్పుడు వైసీపీ అధ్యక్షుడు జగన్‌పై జరిగిన కోడికత్తి దాడిలాంటి చిన్న కేసుపై ఎన్‌ఐఏ విచారణ చేయడం.. ఆ సంస్థ చట్ట పరిధిని అతిక్రమించడమే’ అని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంటోంది. ఈ విషయాలన్నింటినీ ప్రస్తావిస్తూ శనివారం హైకోర్టులో పిటిషన్‌ వేయనుంది. వాస్తవానికి కోడికత్తి కేసుపై ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం విచారణ జరిపింది. ఆ విచారణను కాదంటూ ఎన్‌ఐఏకు కేసును అప్పగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది.

cbn 180120019

దీనిపై ఏం చేయాలన్న దానిపై సీఎం చంద్రబాబుతో డీజీపీ ఠాకూర్‌, అడ్వకేట్‌ జనరల్‌ దమ్మాలపాటి శ్రీనివా్‌సలు రెండుసార్లు భేటీ అయ్యారు. తొలుత కేంద్ర నిర్ణయానికి నిరసనగా ఒక లేఖ రాయాలని అనుకుని ఆ మేరకు రాశారు. అయినా కేంద్రం నుంచి స్పందన లేకపోవడంతో.. ఇప్పుడు హైకోర్టులో పిటిషన్‌ వేయాలని నిర్ణయించారు. అలాగే హైకోర్టులో ఈ అంశం తేలేవరకు కోడికత్తికి సంబంధించిన ఏ రికార్డునూ ఎన్‌ఐఏకు ఇవ్వకూడదని కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్రాల హక్కుల విషయంలో కేంద్రం తలదూర్చడం సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమని.. న్యాయపరంగా బలమైన పోరాటం చేస్తామని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి.

Advertisements