‘ఔట్‌ అయిన బ్యాట్స్‌మన్‌ అంపైర్‌ను నిందించినట్లు... ఓటమి ఖరారు కావడంతో విపక్షాలు ఈవీఎంలను నిందిస్తున్నాయి’ అని ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై సీఎం చంద్రబాబు తీవ్రంగా స్పందించారు. ‘అసలు అంపైరే లేకుండా మ్యాచ్‌ ఆడేయాలని మోదీ జట్టు ప్రయత్నిస్తోంది. రిఫరీ వ్యవస్థనే నాశనం చేస్తోంది. ఈ జట్టును దేశ ప్రజలు ఈ నెల 23న పక్కన పెట్టేస్తున్నారు. అంపైర్‌ను పెట్టుకుని, రిఫరీ వ్యవస్థను, ఇతర వ్యవస్థల్ని సంరక్షిస్తూ నిబంధనల ప్రకారం ఆడే జట్టుకు పట్టం కడుతున్నారు’ అని శుక్రవారం తెలిపారు. ఈసీపై తామెప్పుడూ వ్యక్తిగత విమర్శలు చేయలేదన్నారు. మోదీకే ఆ అలవాటుందన్నారు. ‘గోద్రా అల్లర్ల అనంతరం గుజరాత్‌ సమాజాన్ని మతప్రాతిపదికన చీల్చి... దాని నుంచి లబ్ధిపొందాలనుకున్నారు.

game 27032019

అప్పటి ప్రధాన ఎన్నికల కమిషనర్‌ లింగ్డో తన బృందంతో గుజరాత్‌లో పర్యటించారు. వెంటనే ఎన్నికలు నిర్వహించే పరిస్థితి లేదని చెప్పారు. దీంతో మీరు... జేమ్స్‌ మైఖేల్‌ లింగ్డో ఇటలీ నుంచి వచ్చారా? రాజీవ్‌గాంధీ కుటుంబాన్ని అడగాలి అని వ్యాఖ్యానించారు. లింగ్డో, సోనియాగాంధీ చర్చిలో కలుస్తారా అని వ్యాఖ్యానించారు. ఈసీని మతం పేరిట, వ్యక్తిగతంగా విమర్శించిన మీరా మాకు నీతులు చెప్పేది?’ అని మోదీపై మండిపడ్డారు. ప్రధానికి ఉండాల్సిన లక్షణాలేవీ ఆయనకు లేవన్నారు. ‘దివంగత ప్రధానులు, రాజకీయ నేతల కుటుంబాలపై అసభ్యకర వ్యాఖ్యలు చేస్తా రు. దేశ రక్షణ వ్యవస్థను మీ స్వార్థానికి వాడుకుంటారు. అన్ని వ్యవస్థల్ని, నాయకులను, పార్టీలను నాశనం చేయాలని చూస్తున్నారు. ఇలాంటి ట్రాక్‌ రికార్డు పెట్టుకుని మాకు నీతులు చెప్తారా?’ అని చంద్రబాబు ధ్వజమెత్తారు.

 

game 27032019

"ఎన్నికల షెడ్యూల్‌కు 73 రోజులు తీసుకున్న ఈసికి 50% వీవీ ప్యాట్‌ల లెక్కింపునకు మరో 6 రోజులు తీసుకోవడానికి ఎందుకంత అభ్యంతరం..? నరేంద్రమోదీ ఎందుకు భయపడుతున్నారు..? 50% వీవీ ప్యాట్‌లు లెక్కించాలని ఈసిని ప్రతిపక్షాలు అడిగితే మోదీకి ఏం సంబంధం, ఆయనెందుకు ఉలిక్కిపడుతున్నారు..?. రాజకీయ లాభం కోసం ఎప్పుడో చనిపోయిన నాయకులను, చివరికి నాయకుల కుటుంబ సభ్యులను కించపరిచేందుకు కూడా మోదీ వెనుకాడరు. రక్షణ శాఖను, సైన్యాన్నీ వాడుకుంటారు. మతాల మధ్య చిచ్చు పెట్టి, రాజకీయ నాయకత్వాన్ని చంపేస్తారు. అలాంటి ట్రాక్ రికార్డు ఉన్న ఆయన మాకు నీతిపన్నాలు ప్రబోధిస్తారు" అని చంద్రబాబుఅన్నారు.

Advertisements