కేంద్ర బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్ కు అన్యాయం జరగడం పై తీవ్ర అసంతృప్తిలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు టీడీపీ సమన్వయ కమిటీ భేటీలో తీవ్ర వ్యాఖ్యలు చేశారు... త్వరలోనే కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటామని అన్నారు.... ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ఆసక్తి రేపుతున్నాయి.... బడ్జెట్‌లో అన్ని రాష్ట్రాలకు కేటాయించినట్లే ఏపీకి ఇచ్చారు తప్ప... విభజన హామీలను నెరవేర్చే దిశగా కేంద్రం ఎలాంటి కేటాయింపులు చేయలేదని బాబు అన్నారు. .. అంచెలంచెలుగా కేంద్రం పై పోరాటం చేద్దామని చంద్రబాబు చెప్పారు...

cbn news 15022018 1

మార్చి 5 వరకు కేంద్రానికి డెడ్ లైన్ పెట్టాం కాబట్టి అంచెలంచెలుగా పోరాటం చేద్దామని బాబు ఎంపీలకు సూచించారు. కేంద్ర మంత్రులతో రాజీనామాలు చేయించడం అనేది చాలా చిన్న విషయమని, అంచెలంచెల పోరాటంలో తొలి అంశంగా కేంద్ర మంత్రులతో రాజీనామా చేయిద్దామన్నారు. అప్పటికీ కేంద్రం దిగిరాకపోతే NDA నుంచి బయటకు వచ్చే అంశం పై కూడా నిర్ణయం తీసుకుందామన్నారు... కేడర్‌కు కూడా దీనిపై సంకేతాలు పంపాలని ఆదేశించారు...

cbn news 15022018 2

ఎన్నికల తర్వాత మద్దతుపై బీజేపీ, వైసీపీ మధ్య ఒప్పందం కుదిరినట్టు.. ఆంగ్ల పత్రికలో వచ్చిన ఒక కథనాన్ని చంద్రబాబు సమావేశంలో చదివి వినిపించారు. వైసీపీ కుయుక్తులను ఎండగట్టాలని శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు. .. ఢిల్లీకి టీడీపీ నేత‌లు ఎందుకు వెళుతున్నారో, వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఎందుకు వెళుతున్నారో ప్ర‌జ‌ల‌కు తెల‌పాలంటూ ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు త‌మ నేత‌ల‌తో అన్నారు. తాను ఇప్ప‌టికి 29 సార్లు ఢిల్లీకి వెళ్లానని తెలిపారు. జగన్నాటకాలు అని పత్రికలు రాసినట్లుగా ఆ నాటకాలను ప్రజలకు తెలపండని పిలుపునిచ్చారు....

Advertisements