ఏ విషయాన్నైనా కుండబద్దలు కొట్టినట్టు చెప్పే టీడీపీ పార్టీ నేత జెసి దివాకర్‌రెడ్డి, అందరి మీద ఎలా సెటైర్‌లు వేస్తారో చూస్తుంటాం... అలాంటి దివాకర్‌రెడ్డి పై, ఈ రోజు ముఖ్యామంత్రి చంద్రబాబు సెటైర్ వేసారు... పార్లమెంట్ సమావేశాలకు హాజరుకాకుండా తనను కలవడానికి వచ్చిన టీడీపీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి పై సెటైర్‌ వేస్తూ, ‘‘బడి ఎగ్గొడితే ఫెయిలవుతారు’’ అంటూ చురకలు అంటించారు.. జేసీ పార్లమెంట్ సమావేశాలకు హాజరుకాకపోవడం పై చంద్రబాబు పై విధంగా స్పందించారు.. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ లాబీల్లో జరిగింది..

diwakar 12032018 2

దీంతో జెసి దివాకర్‌రెడ్డి కూడా, అదే స్థాయిలో తిరిగి కౌంటర్ వేసారు.. "తాను ఎప్పుడూ ఫెయిల్ కానని.. బడికి ఎగ్గొట్టిన వారు.. బ్యాక్ బెంచ్‌లో కూర్చున్న వారు ఉన్నత స్థానానికి ఎదిగారు’’ అంటూ సీఎం వేసిన సెటైర్‌కు జావాబు ఇచ్చారు... ముఖ్యమంత్రిని కలిసిన అనంతరం అసెంబ్లీ లాబీ జేసీ మీడియాతో మాట్లాడుతూ ఈ సరదా సంభాషణ గురించి చెప్పారు... అలాగే, తనకు తనకు రాజ్యసభకు వెళ్లాలనే ఆలోచన లేదని చెప్పారు... ఎంపీగానే పోటీ చేస్తానని, పార్లమెంట్ కే వెళ్తానని చెప్పారు..

diwakar 12032018 3

మరో పక్క, టీడీపీ ఎంపీలు ఈ రోజు కూడా ఢిల్లీలో ఆందోళన చేసారు... సభ బయట, లోపల కూడా ఆందోళనలు కొనసాగించారు... ఏపీని ఆదుకోవాలని, విభజన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఉభయ సభల్లోనూ ఎంపీలు ఆందోళనకు దిగారు. ఫ్లకార్డులతో స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టి సభ్యులు నిరసన తెలిపారు. సభాపతి ఎంత సర్దిచెప్పినప్పటికీ సభ్యులు వినలేదు. దీంతో సభా కార్యక్రమాలకు అంతరాయం కలగడంతో స్పీకర్ సుమిత్రా మహాజన్ సభను మంగళవారం నాటికి వాయిదా వేశారు. రాజ్యసభ ఈ రోజు రెండు గంటలకు వాయిదా పడింది...

Advertisements