"నరేంద్ర మోదీ రాజకీయాల్లో నాకంటే జూనియర్‌... అయినా, ప్రధానమంత్రి పదవిలో ఉన్నారు కాబట్టి ఇవ్వాల్సిన గౌరవం ఇచ్చాను. మోదీని కలిసిన ప్రతిసారీ... సార్‌ సార్‌ అంటూ ఆయన ఈగోని సంతృప్తి పరిచేందుకు కూడా వెనుకాడలేదు... ఇలా అంటుంటే, ఎగతాళి చేసిన వారు కూడా ఉన్నారు.. అయినా, నేను అవేమి పట్టించుకోలేదు... రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆయన అహాన్ని సంతృప్తిపరచడానికి కూడా వెనుకాడలేదు", అంటూ నిన్న జరిగిన అఖిలపక్ష సమావేశంలో చంద్రబాబు చెప్పిన మాటలు ఇవి... మోదీ ఒక నియంత తరహా నాయకుడు. మేం అప్పుడే ఎన్డీయే నుంచి బయటకు వస్తే రాష్ట్రానికి మరిన్ని వేధింపులుండేవి...

cbn 08042018

మోదీ.. రాజకీయాల్లో నాకంటే జూనియర్‌. అయినా ప్రధాని పదవిలో ఉన్నారు కాబట్టి ఆయనకు ఇవ్వాల్సిన గౌరవం ఇచ్చాను... రాజకీయాల్లో హుందాతనం ఉండాలి. జగన్‌ నన్ను ఉద్దేశించి బావిలో పడి చావాలనడం దురదృష్టకరం. నన్ను తిట్టిన ప్రతిపక్ష నాయకుడినీ జగన్మోహన్‌రెడ్డిగారూ అనే అంటాను... మొట్టమొదటిసారి జాతీయ స్థాయిలో మోదీ అధికారాన్ని సవాల్‌ చేసింది మనమే. మనకు అన్యాయం జరుగుతుందనే విషయాన్ని దేశానికి చాటగలిగాం. ఇదే స్ఫూర్తితో మన పోరాట పంథా ఉండాలి అంటూ చంద్రబాబు అఖిలపక్ష నేతలతో అన్నారు.. భాజపా నాయకులు కర్ణాటక ఎన్నికలవగానే ఆంధ్రప్రదేశ్‌పైకి వస్తారని చంద్రబాబు పేర్కొన్నారు. ‘‘మనం నైతికంగా చాలా బలంగా ఉన్నాం. మనతో పెట్టుకుంటే వాళ్లకే నష్టం. రాష్ట్రానికి రావలసిన ప్రయోజనాలన్నీ సాధించేంత వరకు రాజీ లేదు. చాలా పోరాటాలు చూశాను’’ అని తెలిపారు.

cbn 08042018

ఎలాంటి సమస్యనైనా, కుట్రనైనా ఎదుర్కొనే నైతిక స్థైర్యం తనకుందని తెలిపారు. ‘మేం అనుకుంటే పోలవరం, అమరావతిలకు పర్యావరణ అనుమతులు ఇవ్వకుండా ఆపేవాళ్లం’ అనేలా కేంద్ర మంత్రి ప్రకాశ్‌ జావడేకర్‌ ఇప్పుడు అంటున్నారని చంద్రబాబు తెలిపారు.. ‘రెండేళ్ల క్రితమే నేను బయటికి వచ్చుంటే ఎంతగా వేధించే వారో దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు. మోదీ డిక్టేటర్‌ తరహా నాయకుడు. ముందే వైదొలగి ఉంటే మరిన్ని వేధింపులు ఉండేవి. పోలవరంతో సహా అనేక ప్రాజెక్టులకు ఇక్కట్లు ఎదురయ్యేవి. వాళ్లు నమ్మక ద్రోహం చేస్తున్నారని పూర్తిగా రూఢీ చేసుకునేదాకా ఎన్డీయేలో ఉండి రాష్ట్ర హక్కుల కోసం పోరాడాను’’ అని చంద్రబాబు వివరించారు.

Advertisements