ఓ పవన్ కళ్యాణ్, ఓ కేఏ పాల్ లాంటి కామెడీ ఆక్టర్లు, ప్రతి ఎన్నికలు ముందు వచ్చి హడావిడి చెయ్యటం చూస్తూ ఉంటున్నాం. అయితే వీళ్ళ మాటలని పెద్దగా ఎవరూ పట్టించుకోరు. ఈ కోవలనే, పవన్ కళ్యాణ్ ని చూస్తూ వస్తున్నారు చంద్రబాబు. పవన్ కళ్యాణ్ గత కొన్ని రోజులుగా, చంద్రబాబుని హేళన చేస్తూ మాట్లాడుతున్నారు. అయితే చంద్రబాబు మాత్రం ఎప్పుడూ లైన్ దాటలేదు. మొన్నటి దాక పవన్ కు ఎంతో గౌరవం ఇచ్చారు. పవన్ విమర్శలు చెయ్యటం మొదలు పెట్టిన తరువాత, పవన్ పై సుతి మెత్తగా విమర్శలు చేస్తున్నారే కాని, ఎక్కడా తీవ్ర విమర్శలు చెయ్యలేదు. అయితే పవన్ కళ్యాణ్ రోజు రోజుకీ రెచ్చిపోతున్నాడు.

cbn 24112018 2

వ్యక్తిగతంగా విమర్శలు చేస్తూ, చంద్రబాబు ముసలోడు, లోకేష్ బాడీ పై విమర్శలు చెయ్యటం, ఇలా రెచ్చిపోతూ మాట్లాడుతున్నారు. అయితే, ఈ రోజు చంద్రబాబు, పవన్ పై చేసిన విమర్శలు చూస్తుంటే, ఇక పవన్ కళ్యాణ్ ని ఏమాత్రం ఉపేక్షించ కూడదని, అనుకున్నట్టు తెలుస్తుంది. ఈ రోజు అనంతపురంలో పవన్ కల్యాణ్‌ పై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. అన్న చిరంజీవి పార్టీని అమ్ముకుని పోతే.. అదే చేసేందుకన్నట్టుగా పవన్ వచ్చాడని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అనంతపురం జిల్లా టీడీపీ కార్యకర్తలతో జరిగిన సమావేశంలో పాల్గొన్న చంద్రబాబు మాట్లాడుతూ పవన్ తీరును తీవ్రంగా ఎండగట్టారు.

cbn 24112018 3

నాడు తన సిధ్ధాంతాలు రైటని, నేడు తననే మొసగాడంటున్నాడని.. పవన్ ఓ ఊసరవెళ్ళి అంటూ జనసేనానిపై మండిపడ్డారు. ప్రజలను మోసం చేసి, టోపీలు వేయడానికి అటు వైసీపీ, ఇటు జనసేన పార్టీలు వచ్చాయని.. తస్మాత్ జాగ్రత్త అంటూ హెచ్చరించారు. జగన్ కోడి కత్తి.. అంతా ఓ డ్రామా అన్నారు. పీఎం మోదీని ఎదిరించి ప్రజల కోసం కష్టపడి పనిచేస్తున్నానని.. ఎన్ని సమస్యలు వచ్చినా.. ఎన్ని కష్టాలు వచ్చినా.. ఎదుర్కోవడానికి తాను సిధ్ధమన్నారు. మరోవైపు రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ప్రతి నియోజకవర్గంలో ప్రజలతో మమేకమై పనిచేస్తున్న నాయకులకు ఎప్పుడూ అండగా ఉంటానని హామీ ఇచ్చారు.

Advertisements