సేవ్ కంట్రీ-సేవ్ డెమోక్రసీ అనే నినాదంతో సీఎం చంద్రబాబు దేశాన్ని ఏకం చేస్తున్నారు. బీజేపీ ప్రభుత్వాన్నిదించాలనే లక్ష్యంగా ఆయన కాంగ్రెస్‌తో పాటు ఇతర పార్టీల నేతలను ఢిల్లీలో కలిశారు. చంద్రబాబు పిలుపుతో బీజేపేతర పార్టీలన్నీ ఏకతాటిపైకి వస్తున్నాయి. ఈ పక్రియలో భాగంగా చంద్రబాబు దూకుడు పెంచారు. బీజేపేతర పార్టీలను ఏకం చేస్తున్న చంద్రబాబు వ్యూహానికి అనూహ్య స్పందన వస్తోంది. ఇప్పటికే 18 పార్టీలు కూటమిలో చేరేందుకు సానుకూలంగా ఉన్నాయని విశ్వసనీయవర్గాల సమాచారం. ఇదే సమయంలో బీజేపీ వ్యతిరేకపక్షాలతో దేశవ్యాప్తంగా భారీ సభలు, ర్యాలీల నిర్వహణకు సీఎం కసరత్తు చేస్తున్నారు. జాతీయ, ప్రాంతీయ పార్టీ నేతలతో జరుపుతున్న చర్చల్లో సీఎం ఈ ప్రతిపాదనలు తీసుకువస్తున్నారు.

cbn mahakutami 25112018 2

డిసెంబరు 11న ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే పార్లమెంట్‌ వేదికగా మహాకూటమి ఏర్పాటుకు నాంది పడనుంది. మహాకూటమికి రోజురోజుకూ స్పందన పెరుగుతోందని, కూటమిలో చేరే పార్టీల సంఖ్య పెరుగుతోందని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత ఒకరు చెప్పారు. ఏపీ సీఎం చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలు సఫలీకృతం అవుతున్నాయన్నారు. ఒడిసాలో బీజేడీ కూడా మహాకూటమిలో చేరేందుకు సిద్ధమవుతోందని, ఆ రాష్ట్ర సీఎం నవీన్‌ పట్నాయక్‌ ఇప్పటికే బాబుతో చర్చించినట్లు తెలుస్తోందన్నారు. జనవరిలో మమతా నిర్వహిస్తున్న ర్యాలీకి హాజరయ్యేందుకు బీజేడీ అంగీకరిం చిందన్నారు.

cbn mahakutami 25112018 3

కశ్మీరులో రాష్ట్రపతి పాలన విధించడంతో అక్కడి పీడీపీ, నేషనల్‌ కాన్ఫరెన్స్‌ రెండూ కూటమిలో చేరేందుకు అవకాశం ఏర్పడిందని తెలిపారు. జేడీయూ కూడా ఎన్డీయేకు గుడ్‌ బై చెప్పే అవకాశాలు కనిపిస్తున్నాయి. మహాకూటమిలో ప్రస్తుతం కాంగ్రెస్‌, తెలుగుదేశం,ఎస్పీ, బీఎస్పీ, తృణమూల్‌ కాంగ్రెస్‌, డీఎంకే, జేడీఎస్‌, ఎన్సీపీ, ఆర్జేడీ, జేఎంఎం, జార్ఖండ్‌ వికాస్‌ పార్టీ, రాష్ట్రీయ లోక్‌ దళ్‌, నేషనల్‌ కాన్ఫరెన్స్‌, పీడీపీ, లోక్‌ తాంత్రిక్‌ జనతాదళ్‌, సీపీఐ, సీపీఎం, ఆప్‌ఉన్నాయి.

Advertisements