ఎదో ఒక చిన్న ఊరట.. ఈ నిర్ణయం వల్ల, ప్రజలకు పెద్దగా ఒరిగేది ఏమి లేకపోయినా, మన రాష్ట్రానికి హక్కుగా రావాల్సిన ఒక చిన్న విభజన హామీ నెరవేర్చింది కేంద్రం... రూ.219 కోట్లతో ఆంధ్రప్రదేశ్‌లో గ్రేహౌండ్స్‌ యూనిట్‌ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. గురువారం కేంద్ర హోంశాఖ ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో హైదరాబాద్‌లో ఉన్న గ్రేహౌండ్స్‌ శిక్షణ కేంద్రం తెలంగాణకు చెందిన క్రమం లో ఏపీలో కొత్తగా గ్రేహౌండ్స్‌ శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని రాష్ట్ర విభజన చట్టంలోని సెక్షన్‌ 9(3)లో ఉంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అధికారుల మధ్య చర్చోపచర్చల తర్వాత ఒక యూనిట్‌ ఏర్పాటుకు కేంద్రం ఆమోదించింది.

center 02032018 2

దీని ఏర్పాటుకు సాధ్యమైనంత త్వరగా నిధులు ఇవ్వాలని, యూనిట్‌ ఏర్పాటుకు అవసరమైన మౌలికసదుపాయాలు, ఇతర సౌకర్యాలు కల్పనకు సహకరించాలని రాష్ట్రం విజ్ఞప్తి చేసింది. రూ.858.37 కోట్లతో ఈ ప్రాజెక్టు చేపట్టడానికి DPRను కేంద్ర హోంశాఖకు పంపింది. అదే సమయంలో పోలీసు ప్రధాన కార్యాలయం, పోలీసు విభాగానికి సంబంధించిన ఇతర అవసరాల కోసం 2014లోనే రాష్ట్ర ప్రభుత్వం గుంటూరు డివిజన్‌లో 2700 ఎకరాల భూమిని గుర్తించింది.

center 02032018 3

ఈ నేపథ్యంలో అమరావతిలో 250 ఎకరాల విస్తీర్ణంలో 2 యూనిట్లుగా ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు రచించింది. కాగా, రాష్ట్రంలో పూర్తిస్థాయి శిక్షణ కేంద్రం లేకపోవడం వల్ల విశాఖపట్నంలో ఉన్న గ్రేహౌండ్స్‌ ఆపరేషనల్‌ హబ్‌లోనే శిక్షణ తదితర కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. గతంలో కేంద్ర హోంశాఖ అధికారుల బృందం హైదరాబాద్‌లోని గ్రేహౌండ్స్‌ కేంద్రానికి వచ్చి ఈ అంశంపై చర్చించింది. తర్వాత 2016 డిసెంబరులో ఆ బృందం ఏపీలో పర్యటించి గ్రేహౌండ్స్‌ శిక్షణ కేంద్రం ఏర్పాటుకు భూముల వివరాలివ్వాలని విజ్ఞప్తి చేసింది.

Advertisements