కుప్పం నియోజకవర్గంలో చంద్ర‌బాబు ప‌ర్య‌ట‌న నేప‌థ్యంలో టెన్ష‌న్ వాతావ‌ర‌ణం నెల‌కొంది. భారీగా పోలీసుల మోహరింపుతో శాంతిపురం మండలం 121 పెద్దూరు వద్ద ఉద్రిక్తంగా మారింది.  రోడ్ షో, స‌భ‌, ప‌ర్య‌ట‌న‌కి అనుమ‌తి లేద‌ని డిఎస్పీ సుధాకర్ రెడ్డి చంద్ర‌బాబుకి నోటీసు ఇచ్చేందుకు ప్ర‌య‌త్నించారు.  సభలు, సమావేశాలు, ర్యాలీలు ఎందుకు నిర్వహించకూడదని పోలీసులను చంద్రబాబు ఎదురు ప్ర‌శ్నించారు. పోలీసుల వైఖరిపై టిడిపి అధినేత మండిప‌డ్డారు. ఎట్టి ప‌రిస్థితుల్లో టూర్ కొన‌సాగుతుంద‌ని, కార్యకర్తలు సంయమనం పాటించాలని సూచించారు. డిఎస్పీ ఇచ్చిన నోటీసు తీసుకునేందుకు చంద్రబాబు నిరాక‌రించారు. త‌న‌కు ఎందుకు నోటీస్ ఇస్తున్నారో వివరణతో రాతపూర్వకంగా ఇవ్వాలని చంద్రబాబు కోరారు. మ‌రోవైపు ప్ర‌తీ జంక్ష‌న్లోనూ చంద్ర‌బాబుకి స్వాగ‌తం ప‌ల‌క‌డానికి వ‌చ్చిన ప్ర‌జ‌ల‌పై పోలీసులు లాఠీచార్జి చేశారు.

Advertisements