తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు రేపు నెల్లూరు జిల్లా పర్యటన ఉండటంతో,  అధినేతకు స్వాగతం  పలకటానికి టిడిపి నాయకులు భారీగా ఏర్పాట్లు చేసారు. ఈ ఏర్పాట్లలో భాగంగా టీడీపీ శ్రేణులు కటౌట్ లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు. అయితే  ఫ్లెక్సీలు పెట్టటానికి  వీలు లేదు అంటూ మున్సిపల్ కమిషనర్ శివారెడ్డి అడ్డుకున్నారు. దీంతో  కమిషనర్ ఇంటిని టీడీపీ నేతలు ముట్టడించారు. వైసీపీ వాళ్లు  ఫ్లెక్సీలు పెడితో తొలగించకుండా, మేము ఫ్లెక్సీలు పెడితే ఎందుకు అడ్డుకుంటారంటూ టిడిపి నేతలు కమీషనర్ పై ఫైర్ అయ్యారు.  గతంలోకూడా  ఇలాగే ఫ్లెక్సీల మున్సిపల్ కమిషనర్ వివాదంలో ఇరుకున్నారు. ఈ వివాదాల మధ్యే టిడిపి శ్రేణులు రేపటి చంద్రబాబు పర్యటనకు భారీ ఏర్పాట్లు చేసారు. రేపు మధ్యానం చంద్రబాబు నెల్లూరు చేరుకోనున్నారు.

Advertisements