కర్ణాటక అసెంబ్లీ ప్రోటెం స్పీకర్‌గా బీజేపీ ఎమ్మెల్యే కేజీ బోపయ్యను నిబంధలకు విరుద్ధంగా గవర్నర్ వాజూభాయ్ వాలా నియమించారని ఆరోపిస్తూ కాంగ్రెస్ మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అభిషేక్ మను సింఘ్వి, కపిల్ సిబాల్‌తో కూడిన కాంగ్రెస్ న్యాయవాదుల బృందం రాత్రి 8 గంటల ప్రాతంలో సుప్రీంకోర్టు అడిషనల్ రిజిస్ట్రార్ కార్యాలయానికి చేరుకుని తమ పిటిషన్‌ను రిజిస్ట్రార్‌కు అందజేసింది. దీనిపై తక్షణ విచారణ జరపాలని న్యాయవాదుల బృందం ఆ పిటిషన్‌లో కోరింది. ఈ పిటిషన్‌ సీజేఐ కార్యాలయానికి చేరడంతో సీజేఐ తీసుకునే నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది. అయితే ఆయన, ఈ రోజు ఉదయం 10:30 గంటలకు దీని పై విచారణ చేస్తామని చెప్పారు.

jds 19052018 3

2010లో ప్రోటెం స్పీకర్‌గా వ్యవహరించిన బోపయ్య అప్పట్లో యడ్యూరప్పపై విశ్వాస తీర్మానంపై ఓటింగ్‌ సందర్భంగా ఆయన వ్యతిరేక ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేశారని, తద్వారా ఆయనకు అనూకూలంగా వ్యవహరించారని, అయితే బోపయ్య నిర్ణయాన్ని ఆ తర్వాత సుప్రీంకోర్టు కొట్టేసిందని పిటిషన్‌లో న్యాయవాదుల బృందం పేర్కొన్నట్టు తెలుస్తోంది. 8 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన దేశ్‌పాండేకు బదులు మూడుసార్లు మాత్రమే ఎన్నికైన బీజేపీ ఎమ్మెల్యేను, అందులోనూ గతంలో సుప్రీంకోర్టు తప్పుపట్టిన బోపయ్యను ప్రోటెం స్పీకర్‌గా గవర్నర్ వాజూభాయ్ నియమించడం నిబంధనలకు విరుద్ధమని పేర్కొంది.

 

jds 19052018 2

బోపయ్యను ప్రోటెం స్పీకర్‌గా నియమిస్తూ గవర్నర్ తీసుకున్ని నిర్ణయాన్ని అడ్డుకోవాలని కోరింది. శనివారం మధ్యాహ్నం 4 గంటలకు యడ్యూరప్ప బలపరీక్ష సమయంలో నిబంధనల ప్రకారం ప్రోటెం స్పీకర్ నిర్ణయం కీలకమవుతుంది. స్పీకర్‌కున్న అన్ని అధికారాలూ ప్రోటెం స్పీకర్‌కూ ఉంటాయి. ఇప్పటికే అమిత్ షా మోడీ అండతో, గవర్నర్ తీసుకున్న అనేక నిర్ణయాలు వివాదాస్పదం అయ్యాయి. దీని పై సుప్రీం కోర్ట్ కూడా, మొట్టికాయలు వేసింది. అయినా సరే, మళ్ళీ ప్రోటెం స్పీకర్‌ విషయంలో నిబంధనలు తుంగలోకి తొక్కి, గవర్నర్ వ్యవహరించారు. మరి, తరువాత ఏమి అవుతుందో చూడాలి.

Advertisements