ఏదైనా రాష్ట్రంలో అధికార వర్గాలు అన్నిటికీ బాస్ ఛీఫ్ సెక్రటరీ. ముఖ్యమంత్రికి సమానంగా ఉండే స్థాయి ఛీఫ్ సెక్రటరీది. ఒక్క రాజకీయ జోక్యం తప్పితే, ఛీఫ్ సెక్రటరీకి అన్ని అధికారాలు ఉంటాయి. క్రమశిక్షణా చర్యల్లో భాగంగా, ఏ అధికారికైన, ఐఏఎస్ కైనా, షోకాజ్ నోటీస్ ఇచ్చి, వివరణ కోరే అధికారం ఛీఫ్ సెక్రటరీకి ఉంది. అయితే ఇంతటి అధికారాలు ఉన్న ఛీఫ్ సెక్రటరీ ఉణికినే ప్రశ్నించే ఉత్తర్వులు వచ్చాయి. ఛీఫ్ సెక్రటరీ, స్పెషల్ ఛీఫ్ సెక్రటరీ ఇలా సిఎస్ స్థాయి అధికారులకు కూడా, షోకాజ్ నోటీస్ ఇచ్చే అధికారాన్ని తనకు దఖలు చేస్తూ, జీఏడీ (పొలిటికల్‌) ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాశ్‌ పేరిట గురువారం అర్దారాత్రి విదులైన జీవో చూసి, అందరూ ఆశ్చర్యపోయారు. జీఏడీ (పొలిటికల్‌) ముఖ్య కార్యదర్శితో పాటుగా, సీఎం ముఖ్య కార్యదర్శిగా వ్యవహరిస్తున్న ప్రవీణ్‌ ప్రకాశ్‌ జారీ చేసిన జీవో, ప్రకారం, అటు సియం, ఇటు నేను, ఇక మధ్యలో ఎవరికీ సంబంధం లేదన్నట్టుగా, చీఫ్‌ సెక్రటరీనే ఛాలెంజ్ చేసే విధంగా, ఉత్తర్వులు వెలువడ్డాయనే అభిప్రాయం కలుగుతుంది.

chief secretary 26102019 2

గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత వచ్చిన ఈ జీవో 128 పై అధికార వర్గాల్లో, తీవ్ర చర్చ జరుగుతుంది. ఈ విధంగా ఆంధ్రప్రదేశ్‌ బిజినెస్‌ రూల్స్‌కు సవరణలు చేయటం పై, అనేక చర్చలు జరుగుతున్నాయి. ఈ సవరణ, నిబంధనలకు పూర్తి విరుద్ధంగా ఉన్నాయనే విమర్శలు వస్తున్నాయి. బిజినెస్‌ రూల్స్‌ సవరణ చేసే సమయంలో, కేబినెట్‌ ఆమోదం తర్వాత గవర్నర్‌కు పంపించాలని, గవర్నర్ ఆమోదం తరువాతే చీఫ్‌ సెక్రటరీ మాత్రమే ఈ మేరకు జీవో ఇవ్వాల్సి ఉంటుందని అధికార వర్గాలు చెప్తున్నాయి. అయితే ఈ జీవో మాత్రం చీఫ్‌ సెక్రటరీ వద్దకు వెళ్లిన దాఖలాలు లేవని అంటున్నారు. అదీ కాక, ఇది గవర్నర్ ద్వారా జరగాల్సిన ప్రక్రియ అని కూడా అంటున్నారు. బిజినెస్‌ రూల్స్‌కు, అనుబంధ వ్యాఖ్యాన్ని పెట్టాలంటే, సియం ఆదేశాలు సరిపోతాయని, కాని నియమావళి పూర్తిగా మార్చేస్తే, ముందుగా గవర్నర్ ఆమోదం తప్పనసరి అని చెప్తున్నారు.

chief secretary 26102019 3

అయితే ఇప్పుడు ఒక ముఖ్యకార్యదర్శి స్థాయి అధికారి, చీఫ్‌ సెక్రటరీకి షోకాజ్‌ నోటీసులు జారీ చేసే అధికారం ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది అనేది కూడా చర్చ జరుగుతుంది. జగన్ ఆదేశించినా, జీవోలు జారీ అవ్వటం లేదని, సీఎం ముఖ్యకార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాశ్‌, గురువారం కొంత మంది అధికారులతో సమావేశం అయ్యారు. అయితే ఆర్ధిక శాఖ క్లియరెన్స్‌ కోసమే, జీవోలు ఆగిపోయాయని, సమాధానం చెప్పారు అధికారులు. అయితే ఈ సమాధానం పై సంతృప్తి చెందని, ప్రవీణ్ ప్రకాష్, అప్పటికప్పుడు సిబ్బందిని పిలిపించుకుని అర్ధరాత్రి సమయంలో బిజినెస్‌ రూల్స్‌ సవరించేశారు. దీని ప్రకారం, సీఎం లేదా ముఖ్యమంత్రి కార్యాలయం ద్వారా స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీలు , ప్రిన్సిపల్‌ సెక్రటరీ, సెక్రటరీలకు వెళ్లే ఫైళ్లను 3 కేటాగిరీలుగా విభజించారు. అయితే టైంకి జీవో జారీ కాకపొతే, సంబంధిత స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ, ప్రిన్సిపల్‌ సెక్రటరీ, సెక్రటరీలకు షోకాజ్‌ నోటీసులు జారీ చేసి తగు చర్య తీసుకునేలా జీఏడీ పొలిటికల్‌ సెక్రటరీని (ప్రస్తుతం ప్రవీణ్‌ ప్రకాశ్‌) సీఎం ఆదేశించవచ్చు. బిజినెస్‌ రూల్స్‌కు చేసిన తాజా సవరణలు చీఫ్‌ సెక్రటరీ ఉనికినే ప్రశ్నించేలా ఉన్నాయని అధికార వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

Advertisements