కొన్ని రోజుల క్రితం, రమణ దీక్షితులు ప్రెస్ మీట్ తో, ఒక నిర్ఘాంతపోయే విషయం బయట పడింది... క్రైస్తవ మత ప్రచారంలో చురుగ్గా పాల్గొనే బోరుగడ్డ అనిల్‌తో కలిసి రమణ దీక్షితులు హైదరాబాద్‌లో ప్రెస్ మీట్ పెట్టటంతో, యావత్ హిందూ మతం అవాక్కయింది... స్వామి వారికి సేవ చేసిన దీక్షితులు, ఇలాంటి అన్యమత ప్రచారం చేస్తున్న వ్యక్తులతో కలిసి, చట్టా పట్టాలు వేసుకుని తిరుగుతున్నారు. గుంటూరుకు చెందిన అనిల్‌.. సైమన్స్‌ అమృత్‌ ఫౌండేషన్‌ అనే క్రైస్తవ చారిటీ సంస్థను నిర్వహిస్తున్నారు. ఆయన... రిపబ్లికన్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా (ఆర్పీఐ) రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కూడా... ప్రెస్ మీట్ లో రమణ దీక్షితులు వెనకే ఆయన కూర్చున్నారు.

deekshitulu 26062018

అయితే, ఈ విషయం మొదట బయట పెట్టింది, ఏపీ బ్రాహ్మణ చైతన్య వేదిక కో కన్వీనర్‌ సిరిపురపు శ్రీధర్‌. దీంతో, రమణ దీక్షితులు, ఆయన వెనుక ఉన్న ఒక రౌడీ పార్టీ, శ్రీధర్ ను చంపేస్తామంటూ బెదిరిస్తున్నాయి. తనకు బెదిరింపు ఫోన్ కాల్స్‌ వస్తున్నాయని సిరిపురపు శ్రీధర్‌ గుంటూరు అర్బన్‌ ఎస్పీ విజయరావుకు ఫిర్యాదు చేశారు. తిరుమల శ్రీవారి నగలు మాయమాయ్యాయంటూ రమణ దీక్షితులు చేసిన ఆరోపణలు, ప్రభుత్వంపై ఐవైఆర్‌ కృష్ణారావు చేసిన ఆరోపణల్ని తిప్పికొడుతూ వారి వెనుక ఉన్నదెవరో బహిర్గత పరుస్తున్న సిరిపురపు శ్రీధర్‌... తనకు రక్షణ కల్పించాలంటూ ఎస్పీని కోరారు. రమణ దీక్షతులు హైదరాబాద్‌ ప్రెస్‌మీట్‌ నిర్వహించారు. ఆ సమావేశంలో... వివాదాస్పద, క్రైస్తవ మత ప్రచారకుడు ఉన్న విషయాన్ని బయటపెట్టారు సిరిపురపు శ్రీధర్‌.

deekshitulu 26062018

క్రైస్తవ చారిటీ సంస్థ ప్రతినిధి బోరుగడ్డ అనిల్‌కుమార్‌ను పక్కన పెట్టుకుని ప్రెస్‌మీట్‌ నిర్వహించడం...శ్రీవారి భక్తుల మనోభావాలు, హిందూ మతవిశ్వాసాలను అవమానించడమేనంటూ ఆవేదన వ్యక్తం చేశారు సిరిపురపు శ్రీధర్‌. బోరుగడ్డ అనిల్‌కుమార్‌ చిన్నమ్మ జగన్‌కు బంధువు అవతారని కూడా తెలిపారు సిరిపురపు శ్రీధర్‌. సోమాజీగూడలో ప్రెస్‌మీట్‌కు కొన్ని రోజుల ముందు జగన్‌ను కలిశారు రమణదీక్షితులు. క్రైస్తవ మతప్రచారకుడు బోరుగడ్డ అనిల్‌ అరాచకాలు, అక్రమాల గురించి, రమణ దీక్షితులు వ్యవహారశైలిపైనా విరుచుకుపడ్డ సిరిపురపు శ్రీధర్‌... ఐవైఆర్‌ కృష్ణారావుకు వ్యతిరేకంగానూ ప్రెస్‌మీట్‌లు పెట్టారు. ఈ క్రమంలో ఆయనకు బెదిరింపు కాల్స్‌ రావడం కలకలం సృష్టిస్తోంది. నిన్నటి నుంచి మూడు సెల్‌ఫోన్‌ల నుంచి బెదిరింపు కాల్స్‌ వస్తున్నాయని శ్రీధర్‌ ఆరోపిస్తున్నారు. తనకు భద్రత కల్పించాలంటూ గుంటూరు అర్బన్‌ ఎస్పీ విజయరావుకు విజ్ఞప్తి చేశారు.

Advertisements