ఏపీ డీఎస్సీ షెడ్యూల్‌‌ను మంత్రి గంటా శ్రీనివాసరావు గురువారం ఉదయం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడతూ డీఎస్సీ కొంచెం ఆలస్యమైన విషయం వాస్తవమే అని అన్నారు. అయితే ఎక్కువమందికి ప్రయోజనం కలిగేలా డీఎస్సీ ఉండాలని తెలిపారు. రేపు డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. టెట్ కమ్ టీఆర్‌టీ పరీక్ష నిర్వహించనున్నట్లు చెప్పారు. నవంబర్‌ 1 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవచ్చని మంత్రి గంటా శ్రీనివాసరావు వెల్లడించారు. అలాగే డీఎస్సీ పరీక్ష రాసే అభ్యర్థుల వయో పరిమితి రెండేళ్లకు పొడిగిస్తున్నట్లు తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీల వయో పరిమితి 49 ఏళ్లకు, జనరల్‌ కేటగిరీలో 42 నుంచి 44 ఏళ్లకు పొడిగించారు.

dsc 25102018 2

మొత్తం 7325 పోస్టులకు శుక్రవారం నోటిఫికేషన్‌ విడుదలకానుంది. ఇందులో పాఠశాల విద్యాశాఖకు 4341, మోడల్‌ స్కూల్స్‌కు 909, మున్సిపల్‌ స్కూళ్లకు 1100, గిరిజన సంక్షేమ పాఠశాలకు 800, ఏపీఆర్‌ఈఐ సొసైటీ పాఠశాలలకు 175 పోస్టులు ఉంటాయి. కాగా.. ఈ 7325 పోస్టుల్లో 3666 ఎస్జీటీ, 1625 స్కూల్‌ అసిస్టెంట్‌, 452 లాంగ్వేజ్‌ పండిట్‌, 441 పీఈటీ, 556 టీజీటీ, 429 పీజీటీ, 77 ప్రిన్సిపాల్‌, 79 డ్రాయింగ్‌, డాన్స్‌ పోస్టులు ఉన్నాయి.

dsc 25102018 3

డీఎస్సీ షెడ్యూల్ వివరాలు: నవంబర్‌ 1 నుంచి 16 వరకు దరఖాస్తుల స్వీకరణ.. నవంబర్‌ 19 నుంచి 24 వరకు పరీక్షా కేంద్రాల ఎంపిక... నవంబర్‌ 29 నుంచి ఆన్‌లైన్‌లో హాల్‌టికెట్లు.. నవంబర్‌ 17న ఆన్‌లైన్‌లో మాక్‌ టెస్టులు.. డిసెంబర్‌ 6, 11, 12, 13న డీఎస్సీ పరీక్షలు.. డిసెంబర్‌ 6, 11 తేదీల్లో స్కూల్‌ అసిస్టెంట్స్‌ రాత పరీక్ష (నాన్‌ లాంగ్వేజెస్‌).. డిసెంబర్‌ 12, 13 న పీజీ టీచర్స్‌ రాత పరీక్ష.. డిసెంబర్‌ 14, 26న టీచర్స్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్స్‌, ప్రిన్సిపల్స్‌ రాతపరీక్ష.. డిసెంబర్‌ 17న పీఈటీ, మ్యూజిక్‌, క్రాఫ్ట్‌ అండ్‌ ఆర్ట్స్‌ , డ్రాయింగ్‌ రాత పరీక్ష... డిసెంబర్‌ 27న లాంగ్వేజ్‌ పండిట్స్‌ రాతపరీక్ష... డిసెంబర్‌ 28 నుంచి 2019 జనవరి 2 వరకు సెకండరీ గ్రేడ్‌ టీచర్స్‌ రాతపరీక్ష... నవంబర్‌ 1 నుంచి 15 వరకు ఫీజు చెల్లింపునకు అవకాశం..

 

 

Advertisements