మొన్న కేసీఆర్ అసెంబ్లీ రద్దు సమయంలో చెప్పిన సంగతి గుర్తుందా ? నవంబర్ లో ఎన్నికలు వస్తున్నాయి అని మీడియాతోనే చెప్పేశారు. అదేంటి, ఎప్పుడు ఎన్నికలు వస్తాయో చెప్పాల్సింది ఎన్నికల కమిషన్ కదా, కెసిఆర్ కి యా ఇన్ఫర్మేషన్ ఎలా తెలిసింది అంటూ, చివరకి ఈ వ్యాఖ్యల పై ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదుల దాకా వెళ్ళాయి. కెసిఆర్, మోడీ/అమిత్ షా లతో అవగాహన చేసుకునే, ఎప్పుడు ఎన్నికలు వస్తాయనేది క్లియర్ గా చెప్పారు. ఇప్పుడు జగన్ కూడా, జనవరిలో ఎన్నికలు వచ్చేస్తున్నాయి అని చెప్తున్నాడు. అదేంటి మే నెలలో ఎన్నిలు అయితే, ఈయన జనవరి అంటున్నారు అని అందరూ అవాక్కయ్యారు.

jagan 12092018

నిన్న జగన్ విశాఖలో మాట్లాడుతూ, రాష్ట్ర శాసనసభకు జనవరి ఆఖరులో ఎన్నికలు వచ్చే సంకేతాలున్నాయని, మానకు దీని పై కచ్చితమైన సమాచారం ఉందని, పార్టీ నాయకులు, శ్రేణులు ఇందుకు సిద్ధంగా ఉండాలని జగన్‌ అన్నారు. వైకాపా అధికారంలోకి వస్తే అమలు చేస్తామన్న నవరత్న పథకాల్ని, వాటి ప్రయోజనాల్ని ప్రతి ఇంటికీ వెళ్లి అవగాహన కల్పించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. మంగళవారం ఆయన విశాఖలోని ఓ ఫంక్షన్‌హాల్లో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, లోక్‌సభ మాజీ సభ్యులు, అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తలు, జిల్లాల అధ్యక్షులతో విస్తృతస్థాయి సమావేశంలో, ఎన్నికలు ఎప్పుడు వస్తాయో చెప్పేశారు. సెప్టెంబరు 17 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘రావాలి జగన్‌... కావాలి జగన్‌’ కార్యక్రమాన్ని ప్రారంభించాలని నేతలకు చెప్పారు.

jagan 12092018

ఆంధ్రప్రదేశ్‌లోనూ ముందస్తు ఎన్నికలు వస్తాయని వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డి చెబుతున్నారని, భాజపా నాయకుల నుంచి ఆయనకు హాట్‌లైన్‌లో సమాచారం వచ్చిందేమోనని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్‌ వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రభుత్వానికీ తెలియని విషయాలు ఆయనకు తెలుస్తున్నాయని అన్నారు. లోకేష్‌ మంగళవారం శాసనసభ ప్రాంగణంలో విలేకరులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. యువనేస్తంపై శాసనమండలిలో లోకేష్‌ ప్రజంటేషన్‌ బాగుందని మండలిలో ప్రభుత్వ చీఫ్‌విప్‌ పయ్యావుల కేశవ్‌ అభినందించారు. బాగా పనిచేశారన్న ప్రశంసలు ముఖ్యమంత్రి చంద్రబాబునుంచి మొదటిసారి అందుకున్నామని లోకేష్‌ పేర్కొన్నారు. యువనేస్తం వెబ్‌సైట్‌ను కూడా ముఖ్యమంత్రి చూశారని అన్నారు.

Advertisements